తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక .. నేడు జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..
నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నం నేడు నెరవేరుతోంది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ (ఇందూరు)లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ గత ఎన్నికల సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీ నెరవేరుతోంది. గత ఏడాది అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ జాతీయ పసుపు బోర్డుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, తాజాగా…

