లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? ఎవరు దొంగో తేలుతుంది.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..
ఎన్ని ప్రశ్నలు అడిగినా… ఎన్నిరకాల పరీక్షలు పెట్టినా తాను భరిస్తానని… మరి సీఎం రేవంత్ రెడ్డి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తమపై ఉన్న కేసులకు సంబంధించి తామిరువురం ఒకేచోట కూర్చొని అధికారులు, ప్రజలు చూస్తుండగా ప్రశ్నిస్తే… అప్పుడు దొంగ ఎవరో తేలుతుందన్నారు. విచారణ అనంతరం ఆయన ఈడీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు ఉందని, అందుకే తనపై కూడా ఏసీబీ…

