News

National

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా..

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.   దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో…

TELANGANA

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ – అమలు ముహూర్తం ఖరారు..!!

రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 21 శాతం ఫిట్ మెంట్ తో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 53071 మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం పైన ఏటా రూ 418.11 కోట్ల మేర భారం పడనుంది. ఈ నిర్ణయం జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నిర్ణయం పైన…

TELANGANA

ఎన్నికల షెడ్యూల్ విడుదల- రేవంత్ రెడ్డి వరాలు..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.   తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం…

AP

వైసీపీ కొత్త ప్రకటన..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకులను మార్చేసింది. వారి స్థానంలో కొత్త నాయకులను తెరమీదికి తీసుకొచ్చింది. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు.. వంటి లోక్‌సభ స్థానాలకు కొత్త సమన్వయకులు అపాయింట్ అయ్యారు ఇదివరకే.   ఇటీవలే మచిలీపట్నం లోక్‌సభ, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను మార్చివేసింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. గెలుపోటములకు సంబంధించిన…

AP

టీడీపీ, బీజేపీ, జనసేన తొలి సభకు ముహుర్తం ఖరారు-ప్రధాని మోడీ హాజరు !

ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఇవాళ పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పీటీఐ వార్తాసంస్ధకు వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ పొత్తు ప్రకటన నేపథ్యంలో తదుపరి పరిణామాలకు చకచకా రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా మూడు పార్టీల నేతలతో తొలి ఉమ్మడి సభ నిర్వహణకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది   టీడీపీ,…

National

మళ్లీ రెండు సీట్లలో రాహుల్ పోటీ.? ఈసారి.. కాంగ్రెస్ తొలి జాబితా రెడీ..

జాతీయ స్దాయిలో ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధుల తొలి జాబితాను దాదాపుగా సిద్దం చేసింది. త్వరలో దీన్ని విడుదల చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ తమ తొలి జాబితాలో తాము కీలకంగా భావిస్తున్న 10 రాష్ట్రాల్లోని ఆరు రాష్ట్రాల్లో అభ్యర్ధుల పేర్లను విడుదల చేయబోతోంది. ఇందులో పార్టీ కీలక నేతలంతా ఉంటారని అంచనా.   కాంగ్రెస్ పార్టీ లోక్ సభ…

TELANGANA

శివోహం.. కమనీయం వేములవాడ రాజన్న మహా శివరాత్రి ఉత్సవం..!

నేడు మహాశివరాత్రి పర్వదినం.. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగి పోతున్నాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.. అలాంటి పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. పరమశివుడు విశ్వవ్యాప్తమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. అటువంటి మహాశివరాత్రి పర్వదినం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత ఘనంగా జరుగుతుంది.   వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో, శివనామస్మరణతో మారుమోగిపోతుంది. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో…

TELANGANA

పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన.. ఎంఐఎంతో కలిసి అభివృద్ధి అంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు ..

పాతబస్తీ మెట్రో లైన్‌కు శుక్రవారం ఫరూక్‌నగర్ డిపో దగ్గర శంకుస్థాపన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవునా 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. రూ. 2 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని.. మిగితా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామన్నారు సీఎం…

AP

ఉత్కంఠగా అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న పొత్తులపై సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో, ఏపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పొత్తులపై చర్చించినట్టు సమాచారం.   అయితే పొత్తుల అంశం, సీట్ల సర్దుబాటు అంశంపై గత రెండు రోజులుగా చర్చలు జరుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్…

AP

పవన్ ఎఫెక్ట్ – హరిరామ జోగయ్య కీలక నిర్ణయం..!

సీనియర్ రాజకీయనేత చేగొండి హరిరామజోగయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను స్థాపించిన కాపు సంక్షేమ సేనను రద్దు చేశారు. ముద్రగడ పద్మనాభం కాపు సంక్షేమ పోరాటం నుంచి విరమించు కున్న దశలో జోగయ్య కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసారు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా లేఖల ద్వారా పలు సూచనలు చేసారు. పొత్తుల్లో భాగంగా సీట్ల విషయంలోనూ జోగయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు తన భవిష్యత్ పాత్ర పైన జోగయ్య స్పష్టత…