News

TELANGANA

శివోహం.. కమనీయం వేములవాడ రాజన్న మహా శివరాత్రి ఉత్సవం..!

నేడు మహాశివరాత్రి పర్వదినం.. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగి పోతున్నాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.. అలాంటి పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. పరమశివుడు విశ్వవ్యాప్తమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. అటువంటి మహాశివరాత్రి పర్వదినం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత ఘనంగా జరుగుతుంది.   వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో, శివనామస్మరణతో మారుమోగిపోతుంది. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో…

TELANGANA

పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన.. ఎంఐఎంతో కలిసి అభివృద్ధి అంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు ..

పాతబస్తీ మెట్రో లైన్‌కు శుక్రవారం ఫరూక్‌నగర్ డిపో దగ్గర శంకుస్థాపన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవునా 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. రూ. 2 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని.. మిగితా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామన్నారు సీఎం…

AP

ఉత్కంఠగా అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న పొత్తులపై సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో, ఏపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పొత్తులపై చర్చించినట్టు సమాచారం.   అయితే పొత్తుల అంశం, సీట్ల సర్దుబాటు అంశంపై గత రెండు రోజులుగా చర్చలు జరుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్…

AP

పవన్ ఎఫెక్ట్ – హరిరామ జోగయ్య కీలక నిర్ణయం..!

సీనియర్ రాజకీయనేత చేగొండి హరిరామజోగయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను స్థాపించిన కాపు సంక్షేమ సేనను రద్దు చేశారు. ముద్రగడ పద్మనాభం కాపు సంక్షేమ పోరాటం నుంచి విరమించు కున్న దశలో జోగయ్య కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసారు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా లేఖల ద్వారా పలు సూచనలు చేసారు. పొత్తుల్లో భాగంగా సీట్ల విషయంలోనూ జోగయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు తన భవిష్యత్ పాత్ర పైన జోగయ్య స్పష్టత…

National

ఎల్పీజీ రాయితీ పొడిగింపు, మరో ఏడాదిపాటు 300 తగ్గింపు..

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉజ్వల లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఉజ్వల లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్ (LPG)పై ఇస్తున్న రాయితీ గడువును పొడిగించింది. ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం రూ. 300 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి(2025 మార్చి వరకు) ఈ రాయితీని వర్తింపజేసింది.   ఏడాదికి 12 సిలిండర్లు వరకు ఈ రాయితీ లభిస్తుంది. మార్చి 31తో ఈ గడువు ముగియనున్నవేళ ప్రధాని…

TELANGANA

తెలంగాణాను ఎడారి చేసే ప్లాన్; రేవంత్ రెడ్డి రేసుగుర్రం కాదు..కీలుగుర్రం..ఎమ్మెల్సీ కవిత..!

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కరువుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీ ఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేశారు. తెలంగాణలో నీళ్లు ఉన్న ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సాగునీటికి తాగునీటికి కటకట వస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ వదలడం లేదని ఆమె మండిపడ్డారు.   రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిలా…

TELANGANA

ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ భూమి పూజ ..

కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని, సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని కుంటుపరుస్తుందన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రాజీవ్‌ రహదారి ఎలివేటెడ్‌ కారిడార్‌కు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు.   ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా..…

AP

టీడీపీలోకి వివేకా కుమార్తె సునీత – ముహూర్తం, పోటీ స్థానం ఖరారు..!

ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ వివేకా హత్య తరువాత పులివెందుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కొంత కాలంగా సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు సిద్దమయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు సునీత పొలిటికల్ ఎంట్రీతో కడప జిల్లాలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.   సునీత రాజకీయ నిర్ణయం :…

AP

అమిత్ షా వద్ద చంద్రబాబును ఫిక్స్ చేసిన సీబీఐ మాజీ జేడీ ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీనీ చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు.   అటు జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనలేమంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడో తేల్చేశారు. బీజేపీతో మితృత్వం కొనసాగిస్తూనే.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.…

National

ఈ ముసుగు వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నగదు

సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన మరో మలుపు తీసుకుంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తోన్న జాతీయ దర్యాప్తు సంస్థ.. కీలక ప్రకటన విడుదల చేసింది. అతని ఫొటోలను విడుదల చేసింది. ఆచూకీ తెలియజేసిన వారికి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించింది.   బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా వేర్వేరు…