News

TELANGANA

కాళేశ్వరం, బీఆర్ఎస్ – కాంగ్రెస్ పై పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు..!

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పోయి, కాంగ్రెస్‌ వచ్చినా పాలనలో మార్పు లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ ఒకటేనని ఆరోపించారు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం జూట్‌, లూఠ్‌ రెండే కుటుంబ పార్టీలకు తెలుసని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్మక్కవుతోందని కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో త్వరలో 7 మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని ప్రధాని చెప్పుకొచ్చారు.   కుమ్మక్కయ్యారు: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్మక్కవుతోందని…

TELANGANA

కవిత సహా నలుగురితో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా..

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. తాజాగా, సోమవారం లోక్‌సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర రావు, కవిత పాల్గొన్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.   ఈ…

AP

జనసేన రెండో జాబితా సిద్దం..

జనసేనాని పవన్ పోటీ చేసెదెక్కడ. జనసేన రెండో జాబితాలు విడుదల అయ్యేది ఎప్పుడు. పార్టీ ఆశావాహులు, అభిమానులు ఈ నిర్ణయాల కోసం వేచి చూస్తున్నారు. ఇదే అంశం పైన పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు ఖరారయ్యాయి. అందులో అయిదు స్థానాల్లో పవన్ తన అభ్యర్దులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో పది నియోజకవర్గాల అభ్యర్దులను ప్రకటించేలా నిర్ణయించారు. తాను పోటీ చేసే స్థానం పైన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.  …

AP

వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ 50 ఇళ్లకు ఒకరి చొప్పున నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు అధికార పార్టీ కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు విపక్షాలు వాలంటీర్లను టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో అధికారం మారితే కచ్చితంగా వాలంటీర్లను తొలగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇప్పటికే నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది.   ఈ నేపథ్యంలో…

National

ఆగని రైతు నిరసనలు.. మార్చి 6న ఢిల్లీ చలో, 10న దేశ వ్యాప్త రైల్ రోకోకు పిలుపు ..

మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. మార్చి 6న ఢిల్లీలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలని రైతులు సంఘాలు కోరాయి. అంతేగాక, మార్చి 10న దేశ వ్యాప్తంగా రైల్ రోకో చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతు సంఘాల నేతలు సర్వన్ సింగ్ పంధేర్, జగ్జీత్ సింగ్ డాల్లేవాల్ ఇటీవల ఘర్షణలో మృతి చెందిన రైతు స్వగ్రామం బల్లోహ్‌లో మీడియాతో మాట్లాడారు.   ప్రస్తుతం ఉన్న నిరసన కేంద్రాల…

TELANGANA

హైదరాబాద్ సిటీకి మరో గౌరవం.. లక్క గాజులకు జీఐ ట్యాగ్..

నగరంలోని పాతబస్తీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (Geographical indication) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కంట్రోలర్జనరల్ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్గుర్తింపును మంజూరు చేసింది.ఇదివరకే హైదరాబాద్‌ హలీమ్‌కు(Hyderabad Haleem) జీఐ ట్యాగ్‌ దక్కగా, తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరడం విశేషం.   ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌ లాడ్‌బజార్‌ లాక్‌ బేంగిల్స్‌ను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా, ఈ లక్క గాజులకు చెన్నైలోని…

TELANGANA

ఒంటిపూట బడులు, వేసవి సెలవుల పై ప్రభుత్వ నిర్ణయం..!!

తెలంగాణ ప్ర‌భుత్వం ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది. క్రమంగా ఎండలు పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించ‌నున్నట్లు ప్రకటించింది. ఈ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. అయితే.. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు.   ఒంటిపూట బడులతో…

AP

ఒక్కటైన ఆ ఇద్దరు నేతలు – చంద్రబాబు ప్లాన్ ఏంటి..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నేతల జంపింగ్స్ కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. కృష్ణా జిల్లాలో కొత్త రాజకీయం మొదలైంది. మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయనకే అక్కడ సీటు ఖాయమని ప్రచారం సాగుతోంది. దీంతో, రెండు వర్గాలుగా పని చేసిన ఉమా -బొమ్మసాని ఒక్కటయ్యారు. వసంతకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో, సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.   మైలవరంలో కొత్త లెక్కలు : మైలవరం…

AP

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు.   ఈ సందర్భంగా పీకే చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే, గతంలో ప్రశాంత్‌ కిశోర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ…

National

టికెట్ ధరలు తగ్గించిన రైల్వే..

కరోనా సమయంలో భారతీయ రైల్వే ప్యాసింజర్ రైళ్లనన్నింటినీ ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మారుస్తూ వాటి చార్జీలను కూడా భారీగా పెంచింది. చిన్న చిన్న స్టేషన్లలో రైళ్లను నిలుపుదల చేయడం కూడా నిలిపివేసింది. పెద్ద పెద్ద స్టేషన్లలోనే ఆపేలా చర్యలు తీసుకుంది. దగ్గరలోని నగరాలు, పట్టణాల మధ్య తిరిగే మెము, డెముతోపాటు ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరలను కూడా పెంచింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. కనిష్టంగా రూ.10 ఉండే టికెట్ ధరలను కూడా రూ.35 నుంచి రూ.55కు…