News

TELANGANA

అంగన్ వాడీలకు షాకిచ్చిన సీఎం రేవంత్..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగన్ వాడీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తో పాటు బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం సీఎం రేవంత్ మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికిమంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి ఇతర అధికారులు హాజరయ్యారు.   అంగన్ వాడీల ద్వారా బాలింతలు, గర్భిణీలకు మంచి పౌష్టికాహారం అందించాలని సీఎం…

TELANGANA

సిట్టింగ్ లకే ప్రాధాన్యం.. బండి, ధర్మపురి, కిషన్ రెడ్డి మరోసారి అవకాశం…

త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 195 మందితో మొదటి లిస్ట్ ను శనివారం సాయంత్రం ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన అభ్యర్థుల్లో సిట్టింగ్ లే ఎక్కువగా ఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ పేరును ప్రకటించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ పేరును ప్రకటించారు.   అర్వింద్ నిజామాబాద్ సిట్టింగ్…

AP

ప్రధానితో సీఎం జగన్ కీలక భేటీ..

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. పొత్తుల నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీలో బీజేపీ సీట్ల పైన కసరత్తు మొదలు పెట్టిండి. టీడీపీ, జనసేన ఇప్పటికీ బీజేపీ తమతో కలిసి వస్తుందని చెబుతున్నాయి. ఇటు జగన్ ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలోనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. దీంతో, ఈ పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి మొదలైంది.   పొత్తుల…

AP

మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ – ఆదేశాలివ్వండి..!!

ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తవుతోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. ఈ సమయంలో హైదరాబాద్‌ నగరాన్ని మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు చట్టం తెచ్చేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని అందులో కోరారు. కేంద్రాన్ని ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.   ఉమ్మడి రాజధానిగా: కేంద్ర ప్రభుత్వం మరో…

National

భారత రక్షణ వ్యవస్థలో మరో ఆయుధం..!

హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ఉనికిని పెంపొందించే ప్రయత్నంలో, భారత నావికాదళం లక్షద్వీప్‌లోని మినీకాయ్ దీవులలో INS జటాయు అనే కొత్త స్థావరాన్ని స్థాపించాలని యోచిస్తోంది. అంతేకాకుండా, ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు ఐఎన్ఎస్ విక్రాంత్ అనే జంట విమాన వాహక నౌకల్లో భారత నావికాదళం తన కమాండర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో, ఒక క్యారియర్ నుండి టేకాఫ్ అయి మరొకదానిపై ల్యాండింగ్ వంటి హై-టెంపో కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో ఒకే క్యారియర్ గ్రూప్‌కు…

TELANGANA

తెలంగాణలో అమల్లోకి వచ్చిన గృహలక్ష్మి పథకం: ‘జీరో’ బిల్లు జారీ షురూ..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్) శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద వినియోగదారులకు జీరో బిల్లుల జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. మీటర్ రీడర్లు ఇంటింటికీ వెళ్లి రీడింగ్‌ను తీసి 200 యూనిట్లలోపు బిల్లు వచ్చిన వినియోగదారులకు జీరో బిల్లులు అందజేస్తున్నారు.   ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని తెల్లరేషన్ కార్డుతో, ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి జీరో…

TELANGANA

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ గుడ్‌న్యూస్…

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాలకు నిమిషం ఆలస్యం నిబంధన తొలగించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు 5 నిమిషాలు గ్రేస్ టైం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.     ఇప్పటి వరకు 9 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించని అధికారులు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. అనేక మంది విద్యార్థులు ఒక నిమిషం నిబంధనతో పరీక్షలకు దూరమవుతున్న…

AP

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల-మోసం చేసే వాడే మోడీ అన్న షర్మిల..

గతంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దాన్ని అమలు చేసేదీ తామేనంటోంది. ఈ మేరకు ఇవాళ తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల చేసింది. తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని తెలిపింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓ ప్రకటన చేశారు. ఈ సభలో రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా హాజరయ్యారు.  …

AP

వైసీపీ 9వ జాబితాలో సంచలనాలు-అనూహ్యంగా సాయిరెడ్డికి- మంగళగిరిలో మళ్లీ మార్పు..

వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఇవాళ 9వ జాబితాను సీఎం జగన్ విడుదల చేశారు. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఓ ఎంపీ, రెండు అసెంబ్లీ సీట్లకు మాత్రమే ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు. ఇందులో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపికతో పాటు మంగళగిరి అసెంబ్లీ స్దానంలో మరోసారి ఇన్ ఛార్జ్ మార్పు ఉండటం సంచలనంగా మారింది. వైసీపీ ఇవాళ ప్రకటించిన ఇన్ ఛార్జ్ ల జాబితాలో కేవలం మూడు…

National

సూర్యఘర్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ. 78 వేల సబ్సిడీ..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’కు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంతో కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది.   కేబినెట్ నిర్ణయాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. రూ. 75,021…