News

AP

మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ కక్ష సాధింపే… వైసీపీ సర్కారుపై చంద్రబాబు నిప్పులు..

మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్‌ను అక్రమ అరెస్ట్ ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు తెలుగుదేశం దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశంపార్టీ నాయకులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.   వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టు అని విమర్శించారు. శరత్ అక్రమ అరెస్టును…

TELANGANA

మేడారం హుండీల లెక్కింపు.. అంబేద్కర్‌ ఫొటో నోట్ల కలకలం…!

మేడారం హుండీల లెక్కింపు జరుగుతోంది. నాలుగు రోజులపాటు జరిగిన జాతరలో భక్తులు కానుకలు సమర్పించారు. అయితే హుండీల లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. విచిత్రంగా నకిలీ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేద్కర్‌ ఫొటో ఉండడం గమనార్హం. ఇలా అంబేద్కర్‌ ఫొటో ఉన్న రూ.100 కరెన్సీ నోట్లు ఎక్కువగా కనిపించాయి.   అంబేద్కర్‌ ఫొటో ముద్రణకు డిమాండ్‌.. హుండీల్లో వేసిన ఈ కరెన్సీ నోట్ల వెనుక పలువురు భక్తులు భారత కరెన్సీపై అంబేద్కర్‌ ఫొటో…

TELANGANA

బస్తీ మే సవాల్.. మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా రేవంత్.. తొడగొట్టిన కేటీఆర్.!

‘రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా. ఢిల్లీకి బ్యాగులు మోసేందుకే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదు. జీవో 111 రద్దుకు అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. ప్రజాభిప్రాయం మేరకే మేం ఎత్తివేశాం. ప్రస్తుతం మా దృష్టి పూరి‍్తగా తెలంగాణపైనే. కాంగ్రెస్‌ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క ఎన్నికల్లో గెలిస్తే మగాడా? ఓడితే కాదా? రేవంత్‌ను ఏదో భయం వెంటాడుతోంది. మగాడివైతే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. మహిళలకు…

AP

ఎన్నికల్లో అభ్యర్థుల కోసం షర్మిల ఇంటర్వ్యూ..

ఎన్నికలంటే ఏ రాజకీయ పార్టీ కైనా సవాలే. అన్ని రాజకీయ పార్టీలు కేవలం అధికారాన్ని దక్కించుకోవడం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన విజయం దక్కుతుందనే గ్యారెంటీ లేదు. ప్రజల మెప్పు పొందిన వారికే అధికారం లభిస్తుంది. లేకుంటే ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావలసి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని అనుకోదు. ఎందుకంటే అధికారం అనేది చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చు. దేన్నైనా శాసించవచ్చు. ప్రస్తుతం…

AP

టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు.. కీలక పరిణామం.

ఏపీలో పొత్తుల అంశం కీలక మలుపులు తిరుగుతోంది. తెలుగుదేశం,జనసేన ఒక తాటి పైకి వచ్చాయి. కలిసి అభ్యర్థులను ప్రకటించాయి. టిడిపి 94, జనసేన ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి వస్తుందా? రాదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. బిజెపి అగ్ర నాయకత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది. నెల రోజుల కిందట ఢిల్లీ వెళ్లి వెళ్లిన చంద్రబాబు బిజెపి అగ్రనేతలతో సమావేశం అయ్యారు. పొత్తులపై చర్చలు జరిపారు. బిజెపి చంద్రబాబుకు కీలక…

National

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం..

జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు-భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఖచ్చితమైన సంఖ్యను అధికారులు ప్రకటించాల్సి ఉంది.   అనసోల్ పరిధి జంతారా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని అంబులెన్స్‌ల్లో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి. సహాయక…

TELANGANA

తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ: షెడ్యూల్ ఇదే..

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, యాత్రలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచార జోరును పెంచారు. రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు.   ఇప్పటికే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు చేస్తోంది…

TELANGANA

ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం..

ఔటర్ రింగ్ రోడ్డు(ORR) ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్లలో అవకతవకలపై విచారణ చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ టోల్ టెండర్ల పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణను సీబీఐ లేదా మరో సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.   బుధవారం హెచ్ఎండీఏ భవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర నివేదిక…

AP

7 లక్షలమందితో టీడీపీ- జనసేన ఉమ్మడి సభ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన సంయుక్తంగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. ఎన్నికల రణభేరిని మోగించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.   పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేశాయి టీడీపీ-జనసేన. దీనికి తెలుగు జన విజయ కేతనం…

AP

వైసీపీలో ఇంఛార్జీల మార్పు.. 8వ జాబితా విడుదల..

అసెంబ్లీ ఎన్నికల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు జాబితాలను ప్రకటించిన వైసీపీ.. తాజాగా మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన 8వ జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది.   పార్లమెంట్ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంఛార్జీలుగా ప్రకటించింది. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ…