News

National

ఎన్నికల వేళ.. ఆ వివాదాస్పద చట్టం అమలుకు కేంద్రం చర్యలు..

గతంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. వివాదాలకు తెర తీసినట్టవుతోంది.   ఇంకొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే…

TELANGANA

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా.. మార్చి 28న పోలింగ్ జరగనుంది.   ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక…

TELANGANA

రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన రేవంత్..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని, తాజాగా మరో రెండు పథకాలు ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మిగతా హామీలు కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.   కాగా, అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాన్ని అమలు…

AP

వైసీపీకి గుడ్ బై చెప్పనున్న రాయలసీమ మంత్రి..

ఏపీలో ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు మరో వారం, పది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆ లోపు తమకు సీటు కేటాయించే పార్టీలోకి వెళ్లి భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల తర్వాత తలెత్తిన పరిస్ధితుల్లో సీటు కోల్పోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీలు ఫిరాయిస్తుండగా.. ఇప్పుడు ఓ మంత్రి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.   ఏపీలో వైసీపీ…

AP

అమరావతి రైతులకు హైకోర్టులో భారీ ఊరట..!

ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. ఇక్కడ రైతులకు గతంలో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను రద్దు చేసేందుకు వీలుగా రైతులకు సీఆర్డీయే ఇచ్చిన నోటీసులు కలకలం రేపాయి. వీటిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతులకు ఇవాళ ఊరట లభించింది. ఈ నోటీసుల్ని రద్దు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో కేటాయించిన విధంగా యథాతథంగా వారికి ఈ ప్లాట్లు కొనసాగుతాయి.   గతంలో భూసమీకరణ కింద…

NationalTechnology

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్‌ పదవికి విజయ్ శేఖర్ శర్మ గుడ్‌బై..

ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌‌‌కు చెందిన పేటీఎం ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి స్పందించింది. కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధించిన అనంతరం ఆర్బీఐ స్పందించడం ఇదే రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ ప్రకటన తరువాత పేటీఎం షేర్ల ధరలు ఢమాల్ అయ్యాయి. పాతాళానికి పడిపోయాయి. ఒకదశలో 52 వారాల్లో గరిష్ఠంగా 998 రూపాయల వరకు వెళ్లిన…

TELANGANA

ఎల్ఆర్ఎస్‌పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..

తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.   ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా మొత్తం రుసుం చెల్లించిన దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.…

TELANGANA

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారని.. రూ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ. 70 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని కేసీఆర్‌ను దుయ్యబట్టారు.   సింగరేణి కార్మికులకు రూ. కోటి ప్రమాద…

AP

ఏపీ స్పీకర్ సంచలనం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు.   ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని అధికార వైయస్సార్…

Uncategorized

టీడీపీ- జనసేన ఉమ్మడి బహిరంగ సభ పేరు ఇదే…

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.   ఇక ఈ రెండు పార్టీలు కూడా సంయుక్తంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. ఉమ్మడి బహిరంగ సభలకు శ్రీకారం చుట్టనున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రా.. కదలిరా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా…