News

National

నేడు 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన..

అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ఏపీలో 34, తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు జరగనున్నాయి.   169 కోట్ల రూపాయలతో చేపట్టే ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సహ 16 అండర్ పాస్ బ్రిడ్జిల పనులకు నేడు ప్రధాని…

TELANGANA

బీఆర్ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి తీగల కృష్ణారెడ్డి…

లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒకరికొకరు పార్టీని వీడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితోపాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రాజీనామా సమర్పించారు.   ఫిబ్రవరి 27న చేవెళ్లలో జరగబోయే సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నట్లు…

TELANGANA

సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)కు ఇటీవలే సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన కవిత ఆదివారం సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని లేఖలో స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల దృష్యా సీబీఐ నోటీసులు జారీ వల్ల అనేక ప్రశ్నలకు తావిస్తోందని కవిత తెలిపారు.   ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున విచారణకు రావడం అవరోధంగా ఉందని కవిత తెలిపారు.…

AP

జనసేన పరిస్థితి ఇంత హీనమా, దేహీ అనటం పొత్తు ధర్మమా – జోగయ్య..!..

టీడీపీ, జనసేన అభ్యర్దుల ప్రకటనతో కొత్త రాజకీయం మొదలైంది. జనసేన 24 సీట్లకు పరిమితం కావటం ఆ పార్టీ శ్రేణులకు..మద్దతు దారులకు రుచించటం లేదు. సీట్ల దక్కని జనసేన ఆశావాహులు నైరాశ్యం లో ఉన్నారు. మరి కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చేగొండి హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కు లేఖ రాసారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సీట్ల ఒప్పందం కూడా పవన్ సమర్ధించుకుంటారా అని ప్రశ్నించారు.…

AP

బుచ్చయ్య, గంటా సీట్ల పై చంద్రబాబు క్లారిటీ – అసంతృప్తులకు ఏం చెప్పారు..!

టీడీపీలో సీట్లు దక్కని అసంతృప్తులతో చంద్రబాబు మంతనాలు ప్రారంభించారు. సీనియర్లను తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. పార్టీపరంగా ఉన్న పరిస్థితిని వివరించారు. వారికి ఇతరత్రా అవకాశాలు కల్పిస్తామని, పార్టీకి సహకరించాలని కోరారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం నుంచే ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. కందుల దుర్గేష్ ను నిడుదవోలు నుంచి పోటీకి నిర్ణయించినట్లు తెలుస్తోంది.   గోరంట్ల సీటు సేఫ్: టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు పైన క్లారిటీ…

National

సీట్లను పంచుకున్న ఆ రెండు ప్రధాన పార్టీలు.. .

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య పొత్తుల వ్యవహారాలు ఒక్కటొక్కటిగా తేలుతున్నాయి.   ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా…

TELANGANA

“గృహలక్ష్మి” నిబంధనలు ఖరారు – అమలయ్యేది వీరికే..!!

తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీల అమలు పై వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తోంది. మరో రెండు అమలు కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఆరు గ్యారెంటీల్లోని రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఒక్కో కుటుంబానికి రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలను 27న ప్రారంభిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో గృహలక్ష్మి అమలు నిబంధనలు ఖరారయ్యాయి.   మరో రెండు గ్యారంటీల అమలు: తెలంగాణ ప్రభుత్వం హామీ…

TELANGANA

ధరణిపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు- సమగ్ర విచారణకు ఆదేశాలు ..

ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్చి మొదటి వారంలోనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావాలని చెప్పారు.   ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా…

AP

టీడీపీ ఏ వర్గానికి ఎన్ని సీట్లు – జగన్ లెక్కలను సరి చేస్తాయా..!?

ఏపీలో ఈ సారి ఎన్నికల్లో సామాజిక లెక్కలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. చంద్రబాబు, జనసేన తమ తొలి అభ్యర్దుల జాబితా ప్రకటించాయి. సీఎం జగన్ సామాజి లెక్కలే ప్రధానంగా ఇంఛార్జ్ లను మార్పు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 94 మంది అభ్యర్దులను ప్రకటించారు. ఇందులో కొందరు సీనియర్ల సీట్లను పెండింగ్ లో పెట్టారు. ప్రకటించిన సీట్లలో అమలు చేసిన సామాజిక లెక్కలు ఇప్పుడు జగన్ సమీకరణాలను సరి చేస్తాయా లేదా అనే చర్చ మొదలైంది.…

AP

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచే ప్రసక్తే లేదు- జనసేన సీనియర్ నేత బొలిశెట్టి..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.   ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ…