News

National

‘ఢిల్లీ ఛలో’లో ఉద్రిక్తత.. వారి ఆస్తులు సీజ్..

‘ఢిల్లీ ఛలో’లో భాగంగా పంజాబ్-హరియాణా సరిహద్దులో ఇటీవల జరిగిన ఉద్రిక్త ఘటనలపై హరియాణా పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద చర్యలకు సిద్ధమయ్యారు. ముందుస్తుగా హెచ్చరించిన విధంగా పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసానికి పాల్పడినందుకుగాను.. పరిహారం కింద బాధ్యుల బ్యాంకు అకౌంట్లు, ఆస్తులు సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు చనిపోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్లు తెలిపారు.

TELANGANA

నిందితురాలిగా కవిత..ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిన సీబీఐ..

సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఆమె చుట్టూ సీబీఐ ఉచ్చు పన్నినట్టే కనిపిస్తోంది.   ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు కవితకు ఇదివరకే సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు ఇచ్చారు.…

TELANGANA

మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న రేవంత్.. మరో 2 పథకాలపై కీలక ప్రకటన..

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న సీఎం.. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఇక్కడ్నుంచే ప్రారంభించినట్లు గుర్తు చేశారు.   మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు రాకుండా రూ. 110 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. మేడారం జాతరపై కేంద్రం వివక్ష…

AP

ఎన్నికల మేనిఫెస్టో పైన జగన్ కసరత్తు.

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సీఎం జగన్ ఇప్పటికే మూడు సభల ద్వారా కేడర్ ను ఎన్నికలకు సంసిద్దులను చేసారు. చివరి సిద్దం సభ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా నిర్ణయించారు. ఈ నెల 3న చిలకలూరి పేటలో నాలుగు జిల్లాల పార్టీ కేడర్ తో సిద్దం సభ జరగనుంది. ఇటు ఎన్నికల మేనిఫెస్టో పైన జగన్ కసరత్తు ప్రారంభించారు. సిద్దం సభలో సీఎం జగన్ రుణమాఫీ ప్రకటించనున్నారు. పెన్షన్ పెంపు పైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.…

AP

50 మందితో టీడీపీ తొలి జాబితా..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమౌతోన్నారు.   దీనికి పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తోన్నారు. అటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

National

భారత నేవీలోకి 200 బ్రహ్మోస్..

భారత నేవీలో యుద్ధ నౌకల కోసం 200 బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మార్చి మొదటి వారంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్, రక్షణశాఖ దీనిపై అధికారికంగా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. రూ.19 వేల కోట్లు విలువైన ఈ మెగా డీలు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదించింది. మరోవైపు బ్రహ్మోస్ మిసైళ్ల ఎగుమతి కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

TELANGANA

విద్యుత్ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్..

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు.   గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని సీఎం చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై…

TELANGANA

రూ. 500కే గ్యాస్, ఫ్రీ కరెంట్ పథకాల అమలుకు డేట్ ఫిక్స్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కారు మరో ముందుడు వేసింది. గృహజ్యోతి(200 యూనిట్వ వరకు ఉచిత విద్యుత్), రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఫిబ్రవరి 27 లేదా 29న ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్సబ్కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.   మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సీఎం…

AP

టీడీపీ, జనసేన గెలుస్తాయా : వైసీపీని గెలిపిస్తాయా..!!

ఏపీలో ఎన్నికల సమీరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సీట్ల పైన నిర్ణయానికి వచ్చాయి. టీడీపీ సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన తమ అభ్యర్దులను ప్రకటించటంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాల్లోని కీలక నియోజకవర్గాల్లో ఆసక్తి కర పోరు కొనసాగుతోంది.   సీటు కోసం పోటీ : గోదావరి జిల్లాలో…

AP

వైఎస్ షర్మిల అరెస్టు..

ఏపీలో మెగా డీఎస్సీ స్ధానంలో 6100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతల్ని నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా వారు తప్పించుకుని ఉండవల్లి వరకూ వెళ్లారు. దీంతో పోలీసులు షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ…