మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు శరవేగంగా ఏర్పాట్లు!!
తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2024 ఫిబ్రవరిలో 21నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలో మేడారంలో అభివృద్ధి పనులపై తెలంగాణా సర్కార్ ఫోకస్ పెట్టింది. మేడారం అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ మేడారం వెళ్లి మేడారం జాతర పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది,…

