ఏపీలో ఎన్నికల ఎఫెక్ట్.. 21 మంది అధికారుల బదిలీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగి ఏర్పాట్లు ప్రారంభించింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జోన్-4 పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది అధికారులను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. కర్నూలు జిల్లా.. పత్తికొండ తహసీల్దార్‌గా పద్మజ, కోసగికి పీ మురళి, కౌతాళంకు అలెగ్జాండర్, అనంతపురం…

