News

TELANGANA

రేవంత్ కు తొలి పరీక్ష…

అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వని హామీలు అంటూ ఏమి లేవు. ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. వారి అభిమానాన్ని పొందగలిగారు. తెలంగాణలో అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎలా ముందుకెళ్తారో నన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ పథకాలను అమలు చేయడం ఒక ఎత్తు అయితే అభివృద్ధిని కొనసాగించడం కూడా ఒక ఎత్తు. సంక్షేమ పథకాల ఖర్చు ఒక ఎత్తు అయితే.. పడిపోతున్న ఆదాయాన్ని నిలబెట్టడం కూడా కాంగ్రెస్ పార్టీపై…

AP

జనసేన ఆషామాషి కాదు..

ఉమ్మడి ఏపీని సుదీర్ఘకాలం పాలించిన వ్యక్తిగా చంద్రబాబు కు గుర్తింపు లభించింది. ఆయన పూర్వాశ్రమం సైతం కాంగ్రెస్ పార్టీయే. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పూర్వాశ్రమం కూడా కాంగ్రెస్ పార్టీయే. కెసిఆర్ తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వారు. ఈ లెక్కన తెలంగాణ, ఏపీకి పాలించిన సీఎంలలో ముగ్గురుని అందించింది కాంగ్రెస్ పార్టీయే. అలాగని వారు చెప్పుకోవడం లేదే. పార్టీలు అన్నాక నాయకులు తయారవుతారు. వారి ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలు మారుతారు. దానిని మన గొప్పతనంగా చెప్పుకోవడం…

AP

మొన్న పీకే.. నిన్న షర్మిల.. అసలేం జరుగుతోంది?

అటు జగన్ సైతం చంద్రబాబుకు మించి వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. సామాజిక సమీకరణలను తెరపైకి తెస్తూ టిడిపి, జనసేనలకు సవాల్ విసురుతున్నారు. ఆ రెండు పార్టీలను డైలమాలో పెడుతున్నారు. అయితే చంద్రబాబు దీనికి కౌంటర్ అటాక్ చేయడం ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా తనకు టచ్ లో ఉన్న ప్రశాంత్ కిషోర్ ను ఏకంగా తన ఇంటికి రప్పించారు. గత ఎన్నికల్లో వ్యూహాలతో వైసిపికి విజయం చేకూర్చిన ప్రశాంత్ కిషోర్ ను…

CINEMA

గేమ్ ఛేంజర్’.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీలో చరణ్ రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉండగా ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఆలస్యం పై ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చిత్రం రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు. ‘2024 సెప్టెంబర్‌లో విడుదల కానుంది’ అని తెలిపాడు.

AP

ఏపీ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ – హైకమాండ్ నిర్ణయం..!

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా. పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రెండు రోజులుగా వచ్చే లోక్ సభ.. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఏపీలో చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల మార్పు పైన కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న పురందేశ్వరి స్థానంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.   ఏపీ…

AP

ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రానున్న 100రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందనుందన్నారు. యువగళం ముగింపు సభ… కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభలా ఉందని ఆయన అన్నారు.

TELANGANA

ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీలుగా మంత్రులు..

తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు దామోదర రాజనర్సింహ, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు.   రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లాకు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, నల్గొండ…

TELANGANA

మహాలక్ష్మీ పథకం, రైతు భరోసా అందాలంటే – తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయిదు పథకాలకు సంబంధించి దరాఖాస్తులను స్వీకరించేందుకు మార్గదర్శకాలు సిద్దం చేసింది. రేషన్ కార్డులు లేని వారి నుంచి సమాచారం సేకరిస్తోంది. ప్రజలు ఒక్కో పథకానికీ ఒక్కొక్కటి చొప్పున వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నింటికీ కలిపి ఒకే దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించింది.   దరఖాస్తుల స్వీకరణ: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో.. ఐదింటినీ…

CINEMA

అంచనాలకు మించి ఉండబోతున్న సలార్ 2..

టాలీవుడ్ లో ఎక్కడ చూసినా సలార్ గురించి చర్చలు వినిపిస్తున్నాయి. డార్లింగ్ అభిమానులు ప్రభాస్ ను ఆన్ స్క్రీన్ ఎంత డైనమిక్ గా చూడాలి అని అనుకున్నారు ప్రశాంత్ నీల్ అంతకంటే డైనమిక్ గా చూపించేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కి తగిన ఇమేజ్ ఉండే పాత్ర చేశాడు అని అందరూ అంటున్నారు. ఎంతో గ్రిప్పింగా సాగే కథ ,అంతకంటే అద్భుతంగా ఉన్న ఫైటింగ్స్ సన్నివేశాలతో…

AP

చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేట..!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో నారాలోకేష్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ విజయవాడ చేరుకున్నారు.   తర్వాత.. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీతో ప్రశాంత్ కిషోర్ టిడిపి కోసం పనిచేస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆయన పూర్తి…