News

TELANGANA

కాంగ్రెస్ నేతల మంత్రాంగం సక్సెస్ – నో రెబల్స్…!!

తెలంగాణలో కాంగ్రెస్ కు కలిసొచ్చే సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలతో సీట్ల కోసం భారీగా పోటీ కొనసాగింది. టికెట్ రాక పోటీలో నిలిచిన రెబల్స్ పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్దుల విజయానికి సహకరించేందుకు అంగీకరించారు. పార్టీ అధికారంలోకి రావటం కోసం పని చేస్తామని వెల్లడించారు. వీరితో పార్టీ ముఖ్య నేతలు చేసిన మంత్రాంగం ఫలిచింది. దీంతో, ఇక..గెలుపే లక్ష్యంగా ప్రచారం స్థాయిని పెంచేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది.   Advertisement కాంగ్రెస్ ముఖ్య నేతల…

AP

రాష్ట్రంలో కీలకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్..

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభమైంది. బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఐదు గ్రామ/వార్డు సచివాలయాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతారు. ఈ నివేదికలను పరిశీలించి నిర్వహణ, విధానపరమైన అంశాలను క్రోడీకరించనున్నారు. బుధ, గురువారాల్లో అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు దీనిపై సూచనలు, సలహాలను ఇవ్వొచ్చు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది.   Advertisement ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలు, 20న విజయవాడ, విశాఖపట్నం, 24న తిరుపతిలో కుల గణనపై…

National

ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్

ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులపై కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసింది. 2004 నుంచి ఎర్ర చందనం పెంపకంపై కేంద్రం ఆంక్షలు విధించగా తాజాగా వాటిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎర్ర చందనంపై ఉన్న ఆంక్షల్ని తొలగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీని ప్రకారం ఎర్ర చందనం పెంపకంతో పాటు ఎగుమతులపై ఆంక్షల్ని తొలగిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు.

CINEMA

రణబీర్ తో బాలయ్య ‘అన్ స్టాపబుల్’..

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో కి ఈసారి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ విచ్చేస్తున్నాడు. ఈ మేరకు ‘ఆహా’ నుంచి అధికారికంగా అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో రణబీర్, రష్మిక, సందీప్ వంగా ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఇది శాంపిల్ మాత్రమే. అసలు సిసలు షో ఇంకా ముందుంది మేరా దోస్త్! అంటూ…

AP

టీడీపీ ఆఫీస్ కు సీఐడీ నోటీసులు..

ఏపీ టీడీపీకి సీఐడీ మరో షాకిచ్చింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలని కోరింది. కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు సీఐడీ కానిస్టేబుల్‌ నోటీసు అందించారు. ఈనెల 18లోగా కోరిన వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది.   పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు చెప్పాలని అని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఈ నెల 18న సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ నోటీసుల్లో…

TELANGANA

మూన్నూరు కాపు కులస్తుల ఫైట్‌.. ఓటర్లు ఎవరు పక్షాన!

అసెంబ్లీ ఎన్నికల్లో కుల రాజకీయాలు పీక్స్‌కి చేరుతున్నాయి. కులాల ఓట్లు రాబట్టేందుకు అదే సామాజికవర్గం అభ్యర్థులను పార్టీలు బరిలో దింపడం కామన్‌ అయిపోయింది. అభ్యర్థి గుణగణాల కంటే కులగణానాలకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే అన్ని చోట్లా ఇదే ఫార్మూలా కాకుండా డిఫరెంట్‌ వ్యూహాలు రచిస్తున్నాయి. కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులను పోటీలో దింపుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం మూడు ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గం నాయకులను రంగంలోకి దింపాయి.   మున్నూరు కాపు సామజిక వర్గానికి…

TELANGANA

బీజేపీతో ఓవైసీ సోదరుల రహస్య బంధం.. అక్బరుద్దీన్‌కి లాయర్‌గా రఘునందన్‌రావు..

ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అంటారు. అవును ఇప్పుడు ఓవైసీ సోదరులు కూడా ఇలాగే ఎగిరిపడుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ-మజ్లిస్‌ మధ్య ఉన్న రహస్యం బంధాన్ని నిలదీస్తుండగా రేవంత్‌పై భగ్గుమంటున్నారు. మైనార్టీల మనోభావాలతో ఆటలాడుతున్న అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ని…. రేవంత్‌ నిలదీస్తుండగా.. ఆయన్ని కొరకరాని కొయ్యగా భావిస్తున్నారు. అడిగిన ప్రశ్నలకి జవాబివ్వకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. చీప్‌ కామెంట్స్‌ చేస్తూ మైనార్టీలని తప్పుదోవ పట్టిస్తున్నారు.   రేవంత్‌ విసిరిన సవాల్‌కి.. ఓవైసీ సోదరులు ఆన్సర్‌ చేయకుండా.. గతంలో RSSలో పనిచేశానని క్లారిటీ…

TELANGANA

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి..

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లోని రసాయన గిడ్డంగిలో ప్రమాదం జరిగింది. మంటలు నాలుగో అంతస్థు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారని ఉస్మానియా హాస్పటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ నాగేందర్ తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. నాలుగు రోజుల పసికందుతో పాటు మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల దలహర్ కండిషన్ సీరియస్ గా ఉందని ఆయన తెలిపారు. ప్రత్యేక…

CINEMA

టైగర్ 3 లో వార్ 2…

సల్మాన్ ఖాన్ ,కత్రినా కైఫ్ కాంబినేషన్లో వచ్చిన స్పై సీరియస్ మూవీ టైగర్ 3. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మొదటి రెండు చిత్రాలు గ్రాండ్ సక్సెస్ సాధించాయి. యష్ రాజ్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఎండింగ్లో హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ గురించి ఒక ట్విస్టును మేకర్స్ రివిల్ చేశారు. ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్న ఈ ట్వెస్ట్ మూవీకి సంబంధించిన కొత్త శత్రువు గురించి ఎలివేట్ చేస్తూ ఉంది.…

AP

అమరావతే రాజధాని.. టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టో..

ఆంధ్రప్రదేశ్ లో కలిసి పోటీ చేయడానికి సిద్ధమైన టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే రెండుసార్లు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాయి. రాజమండ్రిలో తొలిసారి , విజయవాడలో రెండోసారి భేటీ అయ్యాయి. ఉమ్మడిగా కలిసి పోరాడాల్సిన అంశాలపై ఇరుపార్టీలు నేతలు చర్చించారు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోపై టీడీపీ- జనసేన దృష్టిపెట్టాయి.   అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఇరుపార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉమ్మడి…