నాంపల్లి అగ్నిప్రమాదంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి : గవర్నర్
నాంపల్లిలో సోమవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు సూచించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే నాంపల్లి అగ్నిప్రమాదం : రేవంత్ రెడ్డి అగ్నిప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదాలకు హైదరాబాద్ నిలయంగా మారిపోయిందన్నారు. నగరంలో…

