News

TELANGANA

మాదిగ విరోధులు కాంగ్రెస్, బీఆర్ఎస్.. త్వరలో ఎస్సీ వర్గీకరణ కమిటీ : ప్రధాని మోదీ..

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదిగ ఉపకులాలను విరోధులగా చూస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో శనివారం జరిగిన మాదిగల విశ్వరూప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని ప్రకటించారు.   మాదిగల విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ…

TELANGANA

రికార్డు స్థాయిలో 4795 నామినేషన్లు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే అసలైన వార్…

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అసలు సిసలు ప్రచార హోరు మొదలవనుంది. ఈ దీపావళి ఏ పార్టీల్లో వెలుగులు నింపుతుంది.. ఏ పార్టీకి చీకట్లు నింపుతుందన్నది ఉత్కంఠగా మారింది. పైకి ముక్కోణపు పోరు అంటున్నా.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య అసలైన ఎన్నికల యుద్ధం కనిపిస్తోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండడంతో టైం చాలా తక్కువగా ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి.   ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన…

APCINEMA

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు హైదరాబాద్‌ః తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారాయన. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.…

CINEMA

సలార్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా సలార్. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండటంతో టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. సలార్ పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ లోనే విడుదలవ్వాల్సి ఉండగా.. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేశారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ను డిసెంబర్ 22న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.   సినిమా…

National

ప్రజాప్రతినిధులపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

పబ్లిక్ సర్వెంట్స్ , ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి.. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,175 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 40 శాతం.. అంటే 2,116 కేసులు కనీసం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టుల డేటాను పిల్ ప్రస్తావించింది. పిటిషనర్ల అభ్యర్థనపై, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్..ఈ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ కోసం ప్రత్యేక బెంచ్…

AP

100 రోజుల ప్రణాళిక.. ఉమ్మడి మేనిఫెస్టో.. అజెండా ఇదేనా..?

తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఏజెండాతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల నేతలు విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపకల్పనపై చర్చలు జరిగినట్లు సమాచారం.   పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా సమావేశం జరిగిందని తెలుస్తోంది. మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా వెళ్లేందుకు కరపత్రం రెడీ చేసినట్లు సమాచారం.…

TELANGANA

ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం ఎన్ని దాఖలయ్యాయంటే..?

తెలంగాణలో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. మొత్తం 3,500కుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అసలు సిసలు పోరాట ఘట్టం మొదలవబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ కు చేరుకుంటున్నాయి. మరోవైపు చివరి రోజు అభ్యర్థుల మార్పుతో బీజేపీ అసంతృప్తి పెరిగింది.   తెలంగాణలో నామినేషన్ల గడువు ముగియడంతో తదుపరి ప్రచారాలపై పొలిటికల్ పార్టీలు ఫోకస్ పెంచుతున్నాయి. చాలా చోట్ల అఫిడవిట్లు, నామినేషన్ పేపర్లు నింపడంలో ముఖ్య పార్టీల నేతలతోపాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తడబడ్డారని చెబుతున్నారు.…

TELANGANA

కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి.. వ్యూహాత్మకంగా కామారెడ్డిలో పోటీ..

కామారెడ్డి గడ్డపై నుంచి జంగ్‌ సైరన్‌ మోగించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కారు జోరుకు కామారెడ్డి నుంచే బ్రేక్‌ పడబోతుందని పిలుపునిస్తూ ఆశేష జనవాహిని వెంటరాగా.. కాంగ్రెస్‌ బలం, బలగాన్ని చాటిచెప్పారు. నామినేషన్‌ వేయడంలో లాస్ట్ కావచ్చు కానీ.. విక్టరీ కొట్టేది ఫస్ట్‌ మనమే అంటూ హస్తం నేతల్లో జోష్‌ నింపుతూ.. గులాబీ నేతల్లో గుబులు రేపారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల యుద్ధంలో కీలక ఘట్టం ఇది. వేలాది మంది వెంటరాగా.. కర్ణాటక సీఎం…

CINEMA

హీరోయిన్ రష్మిక హాట్ వీడియో వైరల్, చర్యలు తీసుకోవాలన్న అమితాబ్… అసలు మేటర్ ఇదే!..

రష్మిక మందాన పేరున ఓ హాట్ వీడియో వైరల్ అవుతుండగా సీనియర్ నటుడు అమితాబ్ స్పందించారు. ఇలాంటి వీడియోల మీద చర్యలు తీసుకోవాలని కామెంట్ చేశారు. రష్మిక మందాన ఇండియాలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు. సౌత్ టు నార్త్ దున్నేస్తున్న ఈ భామ పలు భాషల్లో సినిమాలు చేస్తుంది. రష్మిక మందానకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక మందాన వీడియో…

World

నేటి నుంచి భారత్-నేపాల్ సైనిక సమావేశాలు…

భారత్, నేపాల్ సైనిక దళాల మధ్య ఏటా మూడు రోజుల పాటు జరిగే ద్వైపాక్షిక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత బృందానికి సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) డైరెక్టర్ జనరల్ రష్మీ శుక్లా నేతృత్వం వహించనున్నారు. నేపాల్ తరఫున సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్) ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజూ ఆర్యాల్ పాల్గొంటారు. ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో ఇరు దేశాల మధ్య రహస్య సమాచార మార్పిడి, సరిహద్దు ప్రాంత నేరాల కట్టడిపై చర్చించనున్నారు.