తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలో ఘోర ప్రమాదం
తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వెట్రియార్‌కు చెందిన రాజేంద్రన్ యాజ్ ఫైర్ వర్క్స్ పేరిట ఓ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అందులో ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది.…

