తీగ లాగిన ఈడీ: కదిలిన ఫిల్మ్ ఇండస్ట్రీ డొంక: స్టార్ హీరోయిన్, కమేడియన్‌కు కేంద్రం సమన్లు
ముంబై: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి కలకలం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కొరడా ఝుళిపించింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు (Mahadev betting app case)లో దూకుడును పెంచింది. ఇప్పటికే కొందరు కీలక వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మరిన్ని అరెస్టులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో తాజాగా ఈడీ (ED) తాజాగా ముగ్గురు సెలెబ్రిటీలకు సమన్లను జారీ చేయడం…

