వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్ల రగడ
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్ల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. పీహెచ్. డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా గాంధీ జయంతి సాక్షిగా మరోమారు పీహెచ్. డీ అడ్మిషన్ల వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై గత కొద్దిరోజులు కేయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు యూనివర్సిటీ విద్యార్థులను అమానుషంగా కొట్టారని కూడా వారు ఆరోపించారు. పోలీసుల చర్యపై బీజేపీ, కాంగ్రెస్…

