News

National

మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి

మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరికొందరు వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్ పోలీసుల అదుపులో కీలక వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం. అంతేకాదు ఈ డ్రగ్స్ కేసులో బేబీ సినిమా పేరు కూడా తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది కొద్దిరోజుల క్రితం మాదాపూర్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దనుండి…

AP

మాజీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు బెయిల్ కు మొగ్గు

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు బెయిల్ కు మొగ్గు చూపారు. సీఐడీ అరెస్టు తర్వాత బెయిల్ అడక్కుండా రిమాండ్ కు వెళ్లేందుకు మొగ్గు చూపిన ఆయన.. ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చంద్రబాబు బెయిల్ ఎందుకు తీసుకోవడం లేదనే చర్చ సాగింది. ఇవాళ మాత్రం చంద్రబాబు విజయవాడ…

APNational

పవన్ పొత్తు ప్రకటన- విజయనగరం సభలో జగన్ స్పీచ్ కోసం వెయిటింగ్..!!

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి సన్నద్ధమౌతోంది. అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడానికి సన్నాహాలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అవి అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం వైఎస్ జగన్.. శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలను ప్రారంభిస్తారు. అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే వేదికపై నుంచి రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో మెడికల్ కాలేజీలను వర్చువల్…

National

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కేఆర్ పీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మరోసారి ప్రజల ముందు తలక్కుమని మెరిశారు.

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కేఆర్ పీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మరోసారి ప్రజల ముందు తలక్కుమని మెరిశారు. గంగావతి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన గాలి జనార్దన్ రెడ్డి ఆ నియోజక వర్గం ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.   గంగావతి నియోజక వర్గంలోని హీరేహళ్ల డామ్ కు బాగిన (మొక్కులు, గంగమ్మ తల్లికి సారె)…

National

యూపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్..

యూపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ లో వినిపించే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ లకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన యూపీ కేబినెట్ భేటీలో బుందేల్ ఖండ్ లో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేలా ఓ ప్రత్యేక సంస్ధ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ సంస్ధ ఏర్పాటు కాబోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా తరహాలో వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతాన్ని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి…

AP

బాబు `స్కిల్` స్కాంపై సీమెన్స్ ఏం చెబుతోంది?

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ వ్యవహారంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అన్ని ఆధారాలు ఉండటం వల్లే ఆయనను అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించారని, ప్రజా ధనాన్ని దోచుకున్నారనే విషయం తేలిందని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో…

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు ఆసక్తికరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు నాయుడు కి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సబబు కాదని, చంద్రబాబు అరెస్ట్ పద్ధతి ప్రకారం జరగలేదని బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి వ్యాఖ్యలు చేయడం పురందేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేసేలా చేస్తుంది. చంద్రబాబుకు దగ్గుబాటి పురందరేశ్వరి మద్దతు పలుకుతున్నారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుబాటి పురందరేశ్వరి బాధ్యతలు…

AP

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఐడీ ఛీఫ్ సంజయ్ మరోసారి మీడియా ముందుకు

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఐడీ ఛీఫ్ సంజయ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు రిమాండ్ అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారం లో ఉన్నాయని సంజయ్ తెలిపారు. సాధారణం గా కేబినెట్ అనుమతి తర్వాత కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీలకు అటు నుంచి వ్యక్తులకు వెళ్లాయని సంజయ్ తెలిపారు. ఒక కార్పొరేషన్ నుంచి డబ్బు హవాలా రూపంలో ప్రైవేట్ వ్యక్తులకు…

National

ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం

న్యూఢిల్లీ: ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కాబోతోన్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పార్లమెంట్ సమావేశాలు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే దిశగా కేంద్రం ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు, బిల్లులను ప్రవేశపెడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు.…

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో చంద్రబాబుని అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత టిడిపి వైసిపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రంగంలోకి దిగిన టిడిపి నేత, హిందూపురం ఎమ్మెల్యే , సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ను జైలుకు పంపాలన్న కుట్రతో లేని స్కాములు సృష్టించారని ఆరోపణలు గుప్పించారు.…