శ్రీకాళహస్తి టైల్స్ ఫ్యాక్టరీలో పేలుడు: ఇద్దరు కూలీలు మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడు గ్రామం సమీపంలోని ఓ టైల్స్ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ టైల్స్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా ఇద్దరు కూలీలు పాండు, పోతురాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొంతమంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి గ్యాస్ సిలిండర్ పేలడమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వారు సహాయక…

