‘అరుంధతి పశుపతిలా కేసీఆర్‌ను బంధించారు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ప్రతిపక్షాల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు, ప్రజా కళాకారుడు గద్దరన్నకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఆడబిడ్డల ఫోన్లు వినేవాడు…

