సింగరేణికి కేంద్రం భారీ ఊరట.. తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయిస్తూ కీలక నిర్ణయం..
తెలంగాణ ఆర్థిక రంగానికి, సింగరేణి సంస్థ భవిష్యత్తుకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్‌ను నేరుగా సింగరేణి సంస్థకే కేటాయిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో సంతకం చేశారు. ఈ మైనింగ్ లీజ్ కేటాయింపు తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఎంతో మేలు చేకూర్చనుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.…

