News

National

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి ప్రకంపనలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి ప్రకంపనలు రేకెత్తాయి. కల్వకుంట్ల కవిత తర్వాత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న ఎంపీ తనయుడు మాగుంట రాఘవ ఇప్పటికే అప్రూవర్ గా మారారు. తాజాగా కొడుకుతోపాటు తండ్రి కూడా అప్రూవర్ గా మారిపోయారు. శుక్రవారం సాయంత్రం ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది.…

NationalTELANGANA

రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది.

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల మందికి పైగా మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. వారిలో 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేశారు. ఒక్కో రీజియన్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో తొలి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. ప్రథమ బహుమతిగా 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు, తృతీయ 10,000 రూపాయల మొత్తాన్ని వారికి…

National

ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది.

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ సమ్మిట్‌ జరుగబోతోంది. దీని కోసం ఢిల్లీ ముస్తాబైంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు. జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా,…

National

సనాతన వివాదం వేళ..హిందుత్వపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ సమ్మిట్‌ జరుగబోతోంది. దీని కోసం ఢిల్లీ ముస్తాబైంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు. జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా,…

AP

రానున్న ఎన్నికల్లో మరోసారి తాను విశాఖపట్నం నుంచే పోటీచేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ

రానున్న ఎన్నికల్లో మరోసారి తాను విశాఖపట్నం నుంచే పోటీచేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే మూడు లక్షలకు పైగా ఓట్లు లభించాయని, అంతటి చైతన్యవంతమైన వైజాగ్ నుంచే మళ్లీ పోటీచేస్తానన్నారు. గత ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి ఎంపీగా పోటీచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తనను రోజుకు రెండు మూడు పార్టీలవారు కలుస్తున్నారని చెప్పారు. తన మిత్రులతో చర్చించి ఏ పార్టీ నుంచి పోటీచేయాలనే విషయంపై ఒక నిర్ణయం…

National

కేయూ ఘటన: పోలీసులు కొట్టారన్న ఆరోపణలపై వరంగల్ సీపీ సంచలన కామెంట్స్

వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను పోలీసులు కొట్టారంటూ వస్తున్న ఆరోపణలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్‌ నేడు స్పందించారు. ప్రశాంత్‌ అనే విద్యార్థికి నెల క్రితమే గాయమైందని అన్నారు. పోలీసుల దాడిలో అతడి కాలు విరగలేదని చెప్పారు. ఎవరికైనా అనుమానం ఎక్కడికైనా వెళ్లి టెస్టులు చేయించుకోవచ్చని సూచించారు. ఆందోళనకారులను వీసీ చాంబర్ నుండి బయటకు తీసుకువెళ్తున్న క్రమంలో ఒక విద్యార్థికి మాత్రం చిన్న ఫ్రాక్చర్‌ అయిందని వివరించారు. లేని గాయాలకు కూడా విద్యార్థులు కట్లు కట్టుకున్నారని…

AP

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును నిత్యం విమర్శించడమే పని

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును నిత్యం విమర్శించడమే పనిగా పెట్టుకునే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేతికి చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేయడం అస్త్రంగా మారింది. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును, చంద్రబాబు అవినీతిని తూర్పారబడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రేపో మాపో తనను అరెస్టు చేస్తారని, తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని, ఏం జరిగినా భయపడేది లేదని చంద్రబాబు…

AP

ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శల జడివానను ఎదుర్కొంటోన్నారాయన. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. 118,98,13,207 కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లు ఐటీ…

AP

వినాయక చవితిపై క్లారిటీ ఇచ్చిన కాణిపాకం దేవస్థానం

వినాయక చవితిని ఎప్పుడు నిర్వహించుకోవాలనే గందరగోళం నడుస్తోంది. 18, 19 రెండు తేదీల్లో చవితి ఉండటంతో అందరూ సందిగ్ధంలో పడిపోయారు. ఆగమ పండితులు చెబుతున్నదాని ప్రకారం ఈనెల 18వ తేదీ సోమవారం పండగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. సోమవారం ఉదయం 10.15 గంటల వరకు తదియ ఉంది. మధ్యాహ్నం నుంచి చతుర్ధి మొదలై మంగళవారం ఉదయం 10.43గంటల వరకు ఉంది. ఇటువంటి సందర్భాల్లో చతుర్ధి మొదలైన రోజునే వినాయకచతుర్ధి జరుపుకోవాలని గ్రంథాలు చెబుతున్నాయి. 2000, 2009, 2010, 2019…

TELANGANA

మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ పునఃప్రారంభం

భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయి. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ…