News

APNationalTELANGANA

చంద్రయాన్ 3 లో తెలుగు వారి కీర్తి పతాక

చంద్రయాన్ 3 సక్సెస్ తో యావత్ భారతదేశం సంబరాలతో మునిగిపోయింది. ప్రపంచ దేశాల ముందు భారతదేశము గర్వపడేలా చేసింది. ఈ మహత్కార్యంలో తెలుగు వారి భాగస్వామ్యం కీలకంగానే ఉంది. చంద్రయాన్త్రీలో మిషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ మోటమర్రిది విశాఖనగరం. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఒకటి భారీ మిషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందులో ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం. శ్రీకాంత్ మోటమర్రిది విశాఖలోని సీతమ్మధార. ఆయన…

National

చంద్రయాన్_3 వెనక ఉన్న హీరోలు వీరే..

చందమామ రహస్యాలు విప్పడానికి 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకెళ్లిన చంద్రయాన్_3 దక్షిణ ధ్రువం పై విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అయితే దీని వెనక చాలామంది శాస్త్రవేత్తల కృషి ఉంది. ప్రస్తుతం చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావడంతో వీరి మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. గత నెల 14న చంద్రయాన్_3 ప్రయోగం జరిగినప్పటి నుంచి బుధవారం చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ దాకా మండల కాలం పాటు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు తీవ్రంగా…

AP

పట్టువదలని విక్రం.. పట్టు సడలించని ప్రజ్ఞాన్.. ఇవి ఇస్రో తురుపు ముక్కలు

చంద్రయాన్_2 వైఫల్యం తర్వాత ఇస్రో చంద్రయాన్_3 ప్రయోగం చేపట్టింది. దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇస్రో మీద అభినందనల జల్లు కురుస్తోంది. అయితే ఈ ప్రయోగంలో ఇస్రో చాలా తెలివైన పని చేసింది. తన తురుపు ముక్కలుగా విక్రమ్, ప్రజ్ఞాన్ ను వాడుకుంది. అవి కూడా ఇస్రో చెప్పినట్టుగానే చేశాయి. గత వైఫల్యానికి తావు ఇవ్వకుండా విక్రమ్ పట్టు వదలకుండా తన పని తాను దిగ్విజయంగా పూర్తి చేసింది. ప్రజ్ఞాన్ కూడా విక్రమ్ లాగా…

AP

చందమామా అందింది.. ఇక మనమూ అక్కడకు వెళ్లొచ్చు.. ఖర్చెంతో తెలుసా?

చందమామ రావే… జాబిల్లి రావే… కొండక్కి రావే… కోటి పూలు తేవే… ఇలా చిన్నప్పుడు పిల్లల్ని ఆడించడానికి, అన్నం తినిపించడానికి అబద్ధం చెప్పేవారు పెద్దలు. కానీ ఇప్పుడు ఆ అబద్ధమే నిజమవబోతోంది. చందమామ మన కోసం కొండెక్కి రాకున్నా, కోటి పూలు పంపే క్షణాలు మాత్రం త్వరలోనే ఆవిష్కృతం కానున్నాయి. చంద్రయాన్‌ – 3 విజయవంతం అవడం ప్రతీ భారతీయుడు గుండె గర్వంతో ఉప్పొంగే క్షణం. కేవలం ఇప్పటి వరకు 3 దేశాలు మాత్రమే చంద్రుడి మీద…

CINEMANational

చంద్రయాన్_ 3 విజయవంతం: నటుడు ప్రకాష్ రాజ్ ను ఆడుకుంటున్న నెటిజన్లు

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అదే నోరు జారితే ఊరు మొత్తం తిరగబడుతుంది. పై సామెత విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు అనుభవంలోకి వచ్చింది. “జస్ట్ ఆస్కింగ్” పేరుతో బిజెపి విధానాలు మాత్రమే ప్రశ్నించే ఈ నటుడు.. కొన్ని కొన్ని సార్లు తన లైన్ దాటి మాట్లాడుతుంటారు. అవి విమర్శ లాగా ఉంటే బాగానే ఉంటుంది. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఉండటంతోనే అసలు సమస్య వస్తోంది. ప్రకాష్ రాజ్ సమర్థవంతమైన నటుడు. పలు…

NationalWorld

తిరుగుబాటు నేతను మట్టు పెట్టిన పుతిన్‌.. విమాన ప్రమాదంలో లేపేశాడా?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసి వెనక్కి తగ్గాడు. రష్యాలోని తెవర్‌ రీజియన్‌లో ప్రయాణికులతో కూడిన విమానం కూలిపోయినట్లు తొలుత సమాచారం అందింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చనిపోయిన ప్రయాణికుల్లో…

NationalTechnology

“చంద్రయాన్_3” తర్వాత.. జాబిల్లి మీద ఏం జరగబోతోంది?

చంద్రయాన్_2 విఫలమైన తర్వాత ఇస్రో చేపట్టిన చంద్రయాన్_3 ప్రయోగం విజయవంతమైంది. ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ కావడంతో జాబిల్లి దక్షిణ ధ్రువం మీద భారత్ జెండా పాతింది. ఇతర దేశాలకు సాధ్యం కాని రికార్డును సృష్టించింది. చంద్రయాన్_3 సగర్వంగా జాబిల్లి మీద అడుగు పెట్టింది.40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇస్రో అనుకున్న లక్ష్యాలను విక్రమ్ సాధించింది. సరే ఈ విజయం పూర్తయిన తర్వాత.. తదుపరి ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. కొన్ని గంటల్లో..…

World

కేరళలో జననం.. అమెరికాలో వ్యాపారం.. అధ్యక్ష పదవి కోసం బరిలోకి..ఎవరీ వివేక్ రామస్వామి

అమెరికా ఉపాధ్యక్షురాలుగా భారత మూలాలు ఉన్న కమలా హరీస్ వ్యవహరిస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నే ప్రతి నిర్ణయంలోనూ ఆమె కీలకంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె ప్రత్యర్థి పార్టీలోని ఒక వ్యక్తి కూడా అధ్యక్షుడయ్యే స్థాయికి ఎదిగాడు. భారత మూలాలు ఉన్న ఈ వ్యక్తి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, పరిక మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు నిద్రలేని రాత్రులు పరిచయం చేస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరు? భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అమెరికాలో ఆ…

World

హవాయి ద్వీపంలో ఆశ్చర్యం!

ఓ ఐదేళ్ల క్రితం ఓ కంపెనీ తాను తయారు చేస్తున్న కుంకుమ ప్రచారానికి ఓ ప్రకటన షూట్‌చేసింది. ఆ వీడియోలో కనిపించే వారంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కనిపిస్తే.. మహిళలు ధరించిన కుంకుమ మాత్రం ఎర్రగా కనిపిస్తుంది. తమ కంపెనీ కుంకుమ ప్రకాశిస్తుంది అనే కోణంలో ఈ యాడ్‌ రూపొందించారు. ఇపుపడు హవాయి ద్వీపం చూస్తే కుంకుమ కంపెనీ ప్రకటనే గుర్తొస్తుంది. అమెరికాలోని హవాయి దీవిలో ఏర్పడిన భీకర కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 100 ఏళ్లలోనే…

APNational

జగన్ ‘ముందస్తు’ వ్యూహం

వైసిపి ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తోంది. పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గాలను నియమించింది. జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు కార్యదర్శుల నియామకం పూర్తయింది. 26 జిల్లాల్లో పార్టీ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించారు. ఎంపీలు,ఎమ్మెల్యేలతో పాటు పలువురు మాజీ మంత్రులకు అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో నూతన కార్యవర్గాలను ప్రకటించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నియమితులయ్యారు. అనకాపల్లి జిల్లాకు…