వయోజన విద్యతో సామాజిక మార్పు సాధ్యం: జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్
కదిరి, జనవరి 19: సోమవారం రాత్రి కదిరి పట్టణంలోని అడపాల వీధిలో హేమలత నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యాసకులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ప్రతిరోజూ తరగతులకు హాజరై చదువుతోపాటు డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతను కూడా అవగాహన చేసుకోవాలని, తద్వారా ఎలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.…

