అవినీతి ఆరోపణలు: ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ మెరుపు దాడులు
ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందనే తీవ్ర ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అవినీతి నిరోధక బ్యూరో (ACB) అధికారులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అటెండర్ మొదలుకుని సూపరింటెండెంట్ వరకు డబ్బు ఇవ్వనిదే ఫైలు కదలడం లేదని, మొహం మీదే లంచం అడుగుతున్నారని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనిపై అందిన ఫిర్యాదుల ఆధారంగానే ఏసీబీ అధికారులు ఈ భారీ ఆపరేషన్…

