ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..
టీడీపీకి అమ్ముడుపోయారనే అభియోగంతో ఇటీవలే వైసీపీకి చెందిన నలుగురు శాసనసభ్యులు పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత తెలుగు దేశం పార్టీ తనతోనే బేరసారాలు సాగించిందనన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నేతలు తనతో బేరం ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకుంటే…

