గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు..
తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 పరీక్షలు ఇప్పటికే ఎన్నో వివాదాలకు, న్యాయపరమైన ఇబ్బందులకు కారణమవుతున్నాయి. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ.. మరోసారి హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ముఖ్య న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం స్వీకరించడం కీలకంగా మారింది. సింగిల్ బెంచ్ తీర్పు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ ఏడాది మార్చి 10న గ్రూప్-1…

