ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్… ప్రపంచంలో ఇదే మొదటిసారి..!
వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో మైలురాయిని అధిగమించింది. ఏఐ సహాయంతో రూపొందించిన ప్రపంచపు తొలి వ్యాక్సిన్, ప్రాథమిక దశ మానవ ప్రయోగాల్లో (క్లినికల్ ట్రయల్స్) విజయవంతమైంది. భవిష్యత్తులో సంభవించే మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనే దిశగా ఇది ఒక కీలక పరిణామమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. ‘pEVAC-PS’ పేరుతో పిలిచే ఈ నూతన వ్యాక్సిన్‌ను తొలి దశలో భాగంగా 39 మంది ఆరోగ్యవంతులపై పరీక్షించారు. ఈ ప్రయోగాల్లో వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని,…

