News

TELANGANA

పవన్ సంచలన ప్రకటన..! తెలంగాణలో జనసేన పోటీ..!

హైదరాబాద్ లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా ప్రాణాలు అర్పించారని పవన్ గుర్తుచేశారు. వారిపైన ఉన్న గౌరవంతో 12 ఏళ్ల కాలంలో తెలంగాణ పాలకుల గురించి ఒక్కమాట కూడ అనలేదని అన్నారు. తెలంగాణ అంటే తనకు అంత ఇష్టమని స్పష్టం చేశారు.   తెలంగాణపై తనకు ఉన్న ప్రేమను శంకిస్తే సహించేది…

TELANGANA

మా సహనాన్ని పరీక్షించొద్దు.. ఎంతకైనా తెగిస్తాం.. పవన్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్..!

తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష తెలంగాణ సమాజాన్ని, ఇక్కడి అమరవీరులను అవమానించేలా ఉందంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.   తెలంగాణ మీ అయ్య జాగీరా?   తెలంగాణ గడ్డపై నిలబడి పవన్ కళ్యాణ్ తన మనసులోని ద్వేషాన్ని, వివక్షను బయటపెట్టుకున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం…

National

తమిళనాడులో బీజేపీకి గట్టి షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా..!

తమిళనాడు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన అన్నామలై మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పించారు.   మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, 2020లో బీజేపీలో చేరి అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు. అయితే, పార్టీలో తనకు సరైన అవకాశాలు లభించడం…

AP

చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై వస్తున్న చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే సదరు ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   “మేము ఒక చెరువుని కబ్జా చేశామంట, నాకేం పనిలేదా? నిజంగా మీరు అన్నట్టుగా కబ్జా చేస్తే నా ఇల్లు తగలబెట్టేసేవారు” అంటూ పవన్ ఘాటుగా…

TELANGANA

తెలంగాణలో జూన్ 1 నుంచి 12 వరకు సర్కార్ ‘ప్రగతి’ ప్లాన్..?

రెండు వారాల పాటు సర్కార్ బిజీ బిజీ గా గడపనున్నది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా జూన్ 1వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు స్పెషల్ ప్రోగ్రామ్స్ గా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోజుకో డిపార్ట్ మెంట్ నుంచి యాక్టివిటీస్ నిర్వహించనున్నారు. ఇందులో…

TELANGANA

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..నేడు టీజీపీఎస్సీ నుంచి 3 నోటిఫికేషన్లు..!

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న 3 నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ లో టీజీపీఎస్సీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై ప్రతి నెలా ఉద్యోగ నోటఫికేషన్లను జారీ చేయనున్నట్టు స్పష్టంచేశారు. జూన్ లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తామని, ఇకపై ప్రతి నెలా రెండు, మూడు నోటిఫికేషన్లను జారీ…

AP

మంత్రి లోకేష్‌తో ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ భేటీ..

ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు మంత్రి నారా లోకేష్. అందుకోసం ప్రతీ అవకాశాన్ని ఆయన వినియోగించుకుంటున్నారు. దేశంలో కొత్తగా వస్తున్న పారిశ్రామికవేత్తలు ఎవరు? ఏయే విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు అనే దానిపై ఫోకస్ చేశారు. మంత్రి లోకేష్‌తో ఎయిర్‌ ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబైలో సమావేశమయ్యారు.   భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హైపర్‌ స్కేల్…

APNational

24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల..!

దేశంలోని 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమీషన్ ఆప్ ఇండియా విడుదల చేసింది. ఏపీ, కర్ణాటక, గుజరాత్‌లలో 4 స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకుగాను ఎన్నికలు జరగనున్నాయి. ఇక జార్ఖండ్‌లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానలంన్నింటికి నామినేషన్లు దాఖలు చేయాలని కోరుతూ ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.   నామినేషన్లు విత్ డ్రా.. జూన్ 8వ తేది వకరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ఎన్నికల కమీషన్ తెలిపింది.…

AP

‘పీపీపీ’ అంటూ పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు..!

ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.   ఆమె పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను ఆయనను ప్రేమగా ‘పీపీపీ’ (PPP-పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్) గారు అని పిలుచుకుంటాను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ఎన్నికల…

AP

భారత్ భూభాగాలను మేమూ ఆక్రమించాం: నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

భారత్-నేపాల్ మధ్య చాలాకాలంగా నలుగుతున్న సరిహద్దు వివాదం మరోసారి భగ్గుమంది. భారత్ తమ భూభాగాలను ఆక్రమించిందని ఆరోపిస్తున్న నేపాల్… తాము కూడా భారత భూభాగాలను కొన్నిచోట్ల ఆక్రమించామని ఆ దేశ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో నేపాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగగా, గంటల వ్యవధిలోనే ప్రభుత్వం వివరణ ఇచ్చి నష్టనివారణ చర్యలు చేపట్టింది.   ఈ ఏడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పార్లమెంటులో ప్రసంగించిన 35 ఏళ్ల…