గాయం కారణంగా మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రతికా రావల్ దూరం!
త్వరలో జరగనున్న మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌కి ముందు టీమిండియా ఓపెనర్ ప్రతికా రావల్ గాయం కారణంగా వైదొలగడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టోర్నమెంట్‌లో నిలకడైన ఫామ్‌లో ఉన్న రావల్, ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ కోసం ప్రయత్నిస్తూ కాలి మడమకు గాయమైనట్లు సమాచారం. ఈ గాయం కారణంగా ఆమె అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో (AUS) జరగనున్న సెమీస్ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ఈ వార్త క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించింది.…

