మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ నెల 13, 14 తేదీల్లో ములుగు జిల్లాలోని మేడారాన్ని సందర్శించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లను వేగవంతం చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ స్వయంగా మేడారాన్ని సందర్శించి, జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు. గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన సీఎం పర్యటనలో భాగంగా, మేడారం గద్దెల ఆధునీకరణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి రెండు…

