తెలంగాణలో బీజేపీ సరికొత్త ప్లాన్.. !
తెలంగాణలో రాజకీయంగా మరింత పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. ఇకపై వరుస కార్యక్రమాలతో యాక్టివ్ మోడ్ లోకి వెళ్లాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ప్రారంభించి జూన్ నెలాఖరు వరకు విరామం లేకుండా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ సిద్ధం చేసింది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం సులువయ్యేలా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యాచరణను…

