కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విద్యా పథకాలకు కేంద్ర సహకారం కోరుతూ ఆయన రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. గత ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో విచక్షణారహితంగా అధిక వడ్డీలకు చేసిన అప్పులు రాష్ట్ర…

