రైతులకు చంద్రబాబు నూతన సంవత్సర కానుక: కొత్త పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభం.. భూ వివాదాల రహిత రాష్ట్రమే లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నూతన సంవత్సర కానుకగా కొత్త పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భూమే ప్రాణంగా జీవించే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన, మంత్రులు మరియు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ పథకం పురోగతిపై సమీక్షించారు. ప్రజలకు భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే మన ప్రథమ కర్తవ్యమని ఆయన…

