కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతోందని.. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల సంస్థల రాకతో.. ఐటీ హబ్‌గా ఏపీ మారబోతోందని అన్నారు సీఎం చంద్రబాబు. ఇక పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థల నెలకొల్పేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూటమి సర్కార్ పెట్టుబడులు తెస్తోందని సీఎం…

