బెంగళూరు మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు: నిలదీస్తే నవ్వుతూ నిలబడ్డ నిందితుడు.. పోలీసుల చర్యపై ఆగ్రహం!
సిలికాన్ సిటీ బెంగళూరులోని ‘నమ్మ మెట్రో’ (Namma Metro) లో మహిళల భద్రతపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. డిసెంబర్ 24న రద్దీగా ఉన్న మెట్రో రైలులో 25 ఏళ్ల యువతిపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విధానసౌధ స్టేషన్‌లో రైలు ఎక్కిన బాధితురాలు, కోచ్‌లో ప్రయాణికులు ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు తనను అసభ్యంగా తాకాడని ఆవేదన వ్యక్తం చేసింది. ధైర్యంగా అతడిని నిలదీయగా, ఆ వ్యక్తి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, తప్పు చేశాననే…

