వేతన పెంపుపై చర్చలు ఫలించకపోతే షూటింగ్ లు బంద్: కార్మిక సంఘాలు..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వేతనాల పెంపు వివాదంపై చర్చలు కొనసాగుతున్నాయి. నిర్మాతల మండలికి, కార్మిక సంఘాలపై ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో తాజాగా ఈ రోజు మరోసారి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. వేతన పెంపు విషయంలో నిర్మాతలు చేసిన మూడేళ్ల ప్రతిపాదనకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. వేతనాలను 30 శాతం పెంచాలన్న డిమాండ్ పై ఈ రోజు జరగనున్న చర్చలు ఫలవంతం కావాలని…