News

TELANGANA

భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ..

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈ ఉదయం 9 గంటల సమయానికి నీటిమట్టం 48 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.   వరద ప్రభావంతో స్నాన ఘట్టాల ప్రాంతంలోని మెట్లు, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. పవిత్ర స్నానాలు ఆచరించే కల్యాణ కట్ట వరకు…

National

నెహ్రూ కలలుగన్న శాంతి ఒప్పందం.. భారత్-చైనా సంబంధాల్లో కీలక అధ్యాయం..

భారత్-చైనా సంబంధాల గురించి చర్ల వచ్చినప్పుడల్లా ‘పంచశీల ఒప్పందం’ ప్రస్తావనకు వస్తుంది. ‘హిందీ-చీనీ భాయ్ భాయ్’ నినాదాలతో స్నేహానికి ప్రతీకగా మొదలైన ఈ ఒప్పందం, చివరికి రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీయడం ఒక చారిత్రక విషాదం. సుమారు 70 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఒప్పందం వెనుక ఎన్నో ఆశలు, రాజీలు, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఉన్నాయి.   చైనాలో నెహ్రూ చారిత్రక పర్యటన 1954లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చైనాలో…

TELANGANA

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోతున్నారూ : హరీష్ రావు..

వరదలపై చర్చకు వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోతున్నారని ఆయన విమర్శించారు. బీఏసీ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు రోజులే అసెంబ్లీ నడిపిస్తామని ప్రభుత్వం చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో కోరామని హరీశ్ రావు తెలిపారు. వరద నష్టాలు, ఎరువుల కొరత,…

National

ముంబయిలో రిలయన్స్ రెండు భారీ ప్రాజెక్టులు..!

రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వేదికగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ రెండు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ముంబై నగరంలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ప్రణాళికలను ఆవిష్కరించారు. అత్యాధునిక వసతులతో 2,000 పడకల మెడికల్ సిటీని, నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించేలా 130 ఎకరాల కోస్టల్ గార్డెన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.   రిలయన్స్ లాభాపేక్ష రహిత విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెడికల్…

National

ట్రంప్ వల్ల అమెరికా పరువు పోతోంది..! యూఎస్ మాజీ అధికారులు ఫైర్..

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ అనుసరిస్తున్న మొండి విధానాలు అమెరికా బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, వ్యూహాత్మకంగా కీలకమైన భారత్‌ను చైనాకు దగ్గర చేస్తున్నాయని వైట్‌హౌస్ మాజీ ఉన్నతాధికారి, గతంలో అధ్యక్షుడు జో బైడెన్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జేక్ సలివాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.   ఇటీవల ‘ది బల్వార్క్’ అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సలివాన్, ట్రంప్ విధానాల వల్ల అంతర్జాతీయంగా…

AP

రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు: సీఎం చంద్రబాబు..

“రాష్ట్ర అభివృద్ధి అనే యజ్ఞాన్ని అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల్లా తయారయ్యారు. ప్రతి మంచి పనికీ తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. చేతనైతే అభివృద్ధి, సంక్షేమంలో మాతో పోటీ పడాలి తప్ప, ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడం సరికాదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల కుప్పం ప్రజల కలను సాకారం చేస్తూ, హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను నియోజకవర్గానికి తీసుకువచ్చిన చారిత్రక సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీళ్లు…

TELANGANA

జూబ్లీహిల్స్ ను ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దాం: రాంచందర్ రావు..

కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఓట్లు చోరీ చేస్తున్నారని, మజ్లిస్ పార్టీ మద్దతుతో రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం కూడా ఇదే తరహాలో ఓట్లను దొంగిలించి గెలుస్తోందని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.   ఈ సందర్భంగా ఆయన…

TELANGANA

ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు బాగా ఉపయోగపడతారూ -: సీఎం రేవంత్..

ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు బాగా ఉపయోగపడతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఏ ప్రభుత్వం దిగిపోయినా, ఆ ప్రభుత్వం పోవడానికి కమ్యూనిస్టు సోదరులే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను. గత ప్రభుత్వం దిగిపోవడంలో వారి పాత్ర ఎంతో ఉంది” అని అన్నారు.   అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించకపోయినా, అధికారం నుంచి…

National

మోదీతో జెలెన్‌స్కీ టెలిఫోన్ సంభాషణ… పుతిన్ తో భేటీకి ముందు కీలక విన్నపం..

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతు పాత్ర పోషించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చూడాలని, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో రష్యాకు గట్టి సంకేతాలు పంపాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఇరువురు నేతలు ఫోన్‌లో సంభాషించారు. నెల రోజుల వ్యవధిలో మోదీ, జెలెన్‌స్కీ మాట్లాడుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.   ఈ సంభాషణ సందర్భంగా, ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులు,…

AP

కుప్పం ప్రజలకు గుడ్ న్యూస్..! కుప్పం అభివృద్ధికి 6 కీలక ఎంవోయూలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టనుంది. పారిశ్రామికంగా కుప్పం రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఏకంగా విమానాలు, రాకెట్ల తయారీ యూనిట్లతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఫైబర్ బోర్డు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కుప్పం పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలతో మొత్తం 6 కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా కుప్పంలోకి రూ. 2,050 కోట్లకు…