కర్ణాటకలో వింత.. నీలం రంగు గుడ్డు పెట్టిన నాటు కోడి..!
కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దావణగెరె జిల్లా, చన్నగిరి తాలూకాలోని నల్లూరు గ్రామంలో ఓ సాధారణ నాటు కోడి నీలం రంగులో ఉన్న గుడ్డు పెట్టడమే ఈ ఆశ్చర్యానికి కారణం. ఈ వింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం పది నాటు కోళ్లను పెంచుకుంటున్నాడు.…

