News

TELANGANA

సింగరేణికి ‘బంగారు’ అవకాశం.. కర్ణాటకలో పసిడి గనుల అన్వేషణకు లైసెన్స్..

సింగరేణి సంస్థ కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించింది. బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ దక్కించుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్‌గా నిలిచిందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు.   సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయం…

TELANGANA

జీఎస్టీ కౌన్సిల్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు అంటూ కేంద్రం ప్రచారం చేసుకుంటోందని, కానీ ధరల తగ్గింపుపై చిత్తశుద్ధి లేదని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.   కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5 శాతం…

Uncategorized

ప్రజాప్రతినిధులపై కేంద్ర కొత్త చట్టం..! జైలుకెళ్తే పదవి రద్దు.,.!

ప్రజల కోసం రకరకాల చట్టాలను తీసుకొస్తోంది కేంద్రప్రభుత్వం. కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం పెద్దగా చట్టాలు లేవు. తాజాగా కేంద్రం కొత్త చట్టానికి పదును పెడుతోంది. తీవ్రమైన కేసుల్లో జైలుకి వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేందుకు కొత్త చట్టం తీసుకురానుంది.   ప్రధానమంత్రి మొదలు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు తీవ్రమైన నేరాల కిందట అరెస్టయి నెల రోజుల పాటు జైల్లో ఉంటే అటోమేటిక్‌గా పదవి రద్దు కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును…

AP

వెలుగులోకి వస్తోన్న రౌడీషీటర్ శ్రీకాంత్ హిస్టరీ..

అతడో కరడుగట్టిన నేరగాడు. హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక సమయంలో జైలు నుంచి పారి పోయాడు. నాలుగున్నరేళ్లుగా బయటే ఉండి నేర సామ్రాజ్యం విస్తరించాడు. హత్యలు, దాడులు, కిడ్నాపులు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్.. ఇలా అతడు చేయని నేరం లేదు. 4 జిల్లాల పరిధిలో సుమారు 200 మందితో ఒక గ్యాంగు ఏర్పాటు చేసుకున్నాడు.   జైల్లో ఖైదీగా ఉంటూ.. జైలర్ ఎవరుండాలో కూడా డిసైడ్.. ఏ కాంట్రాక్టు పనికి…

AP

పర్యాటక రంగంపై ఏపీ సర్కార్ ఫోకస్..! 280 కోట్లతో భారీ ప్రాజెక్టులు..

ఏపీ పర్యాటక రంగాన్ని జాతీయ స్థాయిలో మరింత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలు, పురాతన శిల్పకళ అన్నట్టుగా ఉన్న ఏపీలో ప్రతి జిల్లా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ శక్తిని ప్రపంచానికి చూపించేందుకు, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలిపేందుకు ఏపీ ప్రభుత్వం తాజా ప్రణాళికలతో ముందుకు వెళ్లింది. దాదాపు రూ. 280 కోట్ల విలువైన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టుల్లో లేపాక్షి,…

TELANGANA

ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.   కాసేపట్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

National

సూరత్‌లో రూ.25 కోట్ల విలువైన వజ్రాల చోరీ..

గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ వజ్రాల చోరీ కలకలం సృష్టించింది. ప్రముఖ డైమండ్ కంపెనీ డీకే అండ్ సన్స్ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు సుమారు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను అపహరించారు. ఈ సంఘటన కపోద్రా ప్రాంతంలోని కంపెనీ ఆఫీస్ కమ్ పాలిషింగ్ యూనిట్‌లో ఆగస్టు 15 నుంచి 17 మధ్య చోటుచేసుకుంది.   పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కంపెనీకి మూడు రోజుల పాటు సెలవులు ఉండటంతో మూసివేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న దుండగులు…

TELANGANA

కులగణనను వక్రీకరిస్తే బీసీలకు న్యాయం జరగదు-సీఎం రేవంత్

కుల గణనను వక్రీకరిస్తే ఇంకో వందేళ్లయినా బీసీలకు న్యాయం జరగదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సర్వే చేయలేదన్నారు. కులగణను పకడ్బంధీగా చేశామని, తప్పులు దొరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కులగణన చేశామని, గాంధీ కుటుంబం మాట ఇస్తే శిలాశాసనమన్నారు.   సర్వాయి సర్దార్ పాపన్నకు సరైన గౌరవం దక్కాలన్నారు. త్వరలో ఆ రోజు రాబోతుందన్నారు. ఆయన గొప్ప యోధుడని కొనియాడారు. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను…

AP

ప్రిన్సిపల్ ఆడియో బయటకు.. అసలు విషయాలు వెల్లడించిన ఎమ్మెల్యే కూన రవికుమార్..

ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారం కొత్త మలుపు తిరిగిందా? ఈ వ్యవహారం వెనుక వైసీపీ నేతలున్నారా? వెలుగులోకి వచ్చిన వెంటనే ఎందుకు సదరు ఎమ్మెల్యే నోరు విప్పలేదు? పార్టీ హైకమాండ్ సీరియస్ కావడంతో ప్రిన్సిపల్ ఆడియో బయటపెట్టారు ఎమ్మెల్యే కూన రవికుమార్.   ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కూన రవికుమార్ తొలిసారి రియాక్ట్ అయ్యారు. అసలు జరిగింది ఏంటి? అన్నీ పూసగుచ్చి మరీ వివరించారు. తాను ఏ…

AP

ఏపీకి కేంద్రం అండగా నిలవాలి.. అశ్విన వైష్ణవ్ కు నారా లోకేశ్ విజ్ఞప్తి..

ఆంధ్రప్రదేశ్‌ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను మంజూరు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్, భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఏపీ టెక్నాలజీ ప్రగతికి సంబంధించిన…