బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ..!
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన సరికొత్త ఐఫోన్ 17 ఉత్పత్తిని బెంగళూరులోని తన ప్లాంట్‌లో ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చెన్నైలోని యూనిట్‌లో ఐఫోన్ల తయారీ జరుగుతుండగా, ఇప్పుడు బెంగళూరులోనూ ఈ ప్రక్రియ మొదలుకావడం ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రణాళికలకు పెద్ద ఊపునిచ్చినట్లయింది. చైనా వెలుపల ఫాక్స్‌కాన్‌కు ఇది రెండో అతిపెద్ద తయారీ కేంద్రం కావడం గమనార్హం.…

