News

TELANGANA

రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది. మూసీ నది పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, సెమీకండక్టర్, రక్షణ రంగ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. రూ.1.5 లక్షల కోట్లతో హైదరాబాద్‌ను అద్భుత నగరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి ఆధునిక ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక…

AP

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!

రాష్ట్రంలోని మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారబోయే ‘స్త్రీశక్తి’ పథకం ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఈ పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అధిక రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, భద్రత అంశంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం…

AP

వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..!

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోందంటూ ఆయన కుమార్తె సునీత ఆరోపిస్తున్నారు. హత్యకేసులో కీలక నిందితులు తప్పించుకోవాలని చూస్తున్నారని, తమకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరిపై ఒత్తిడి తెచ్చారని అంటున్నారు. ఈ బెదిరింపులపై ఆమె చేసిన ఫిర్యాదుని పరిగణలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జైలులో దస్తగిరిని బెదిరించిన విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్…

AP

పీ4 కార్యక్రమంపై స్వర్ణాంధ్ర ఫౌండేషన్ స్పష్టత..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 (ప్రజా-ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమంపై వస్తున్న కొన్ని కథనాల నేపథ్యంలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ స్పష్టత ఇచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు లేదా ప్రభుత్వ శాఖలకు ఎలాంటి కోటాలు విధించడం లేదని, ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమమని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు ఒక ప్రకటనలో తెలిపారు.   పీ4 కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన ఒక ప్రజా ఉద్యమం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా…

AP

మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ ..! త్వరలో డీజీపీ చేతికి ‘ఆడుదాం ఆంధ్రా’ స్కామ్‌పై విజిలెన్స్ నివేదిక..

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈ నివేదికను విజిలెన్స్ విభాగం అధికారులు ఒకటి రెండు రోజుల్లో డీజీపీకి అందజేయనున్నారు. వైసీపీ హయాంలో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయి.   క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర…

CINEMA

వేతన పెంపుపై చర్చలు ఫలించకపోతే షూటింగ్ లు బంద్: కార్మిక సంఘాలు..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వేతనాల పెంపు వివాదంపై చర్చలు కొనసాగుతున్నాయి. నిర్మాతల మండలికి, కార్మిక సంఘాలపై ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో తాజాగా ఈ రోజు మరోసారి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. వేతన పెంపు విషయంలో నిర్మాతలు చేసిన మూడేళ్ల ప్రతిపాదనకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. వేతనాలను 30 శాతం పెంచాలన్న డిమాండ్ పై ఈ రోజు జరగనున్న చర్చలు ఫలవంతం కావాలని…

TELANGANA

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బాలరాజుకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు.   కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి గువ్వల బాలరాజు ఏ పార్టీలో…

TELANGANA

రిటైర్మెంట్ పై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

తన రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్క ప్రకటనతో తెరదించారు. రాజకీయాల నుంచి తాను తప్పుకోవడం లేదని, చివరి వరకు క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. “జపాన్‌లో ప్రజలకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ ఉండదో, నాకు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు” అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.   తనకు ఇప్పుడు 73 ఏళ్లని, ఇంక రాజకీయమే వద్దనుకుంటున్నానని మల్లారెడ్డి నిన్న వ్యాఖ్యానించాడం చర్చనీయాంశంగా…

National

అమెరికాను ఇరకాటంలో పెట్టిన పుతిన్..!

అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన శైలితో ప్రత్యర్థులకు చుక్కలు చూపే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తాజాగా అమెరికాను ఇరుకునపెట్టేలా సంచలన ఎత్తుగడ వేశారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డిప్యూటీ డైరెక్టర్‌నే లక్ష్యంగా చేసుకుని ఆయన ఆడిన మైండ్‌గేమ్‌తో వాషింగ్టన్ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రత్యేక దూతగా క్రెమ్లిన్‌కు వచ్చిన స్టీవ్ విట్కాఫ్‌తో సమావేశమైన పుతిన్, ఓ అనూహ్య బహుమతిని ఆయన చేతికి అందించి కలకలం రేపారు.   అమెరికా…

AP

వీటిని ఎన్నికలు అనడానికే సిగ్గుగా ఉంది: జడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్ స్పందన..

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విరుద్ధంగా, అరాచకంగా వ్యవహరిస్తున్నారని, కుట్రలు, దాడులు, అబద్ధాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎన్నికలను హైజాక్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గూండాలు, కొందరు అధికారులు, పోలీసులు కలిసి ఈ కుట్రను అమలు చేస్తున్నారని విమర్శించారు.   చంద్రబాబు కుట్రపూరిత ప్రణాళికలను అమలు చేస్తున్నారని మండపడ్డారు. “ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే…