ఎరువులు అక్రమంగా నిల్వచేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయండి: మంత్రి నాదెండ్ల..
రాష్ట్రంలో ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తూ, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి అక్రమార్కులపై సాధారణ 6ఏ కేసులు కాకుండా, నేరుగా పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో…

