ఉగ్రవాదుల మతం చూసి బాధపడొద్దు.. అఖిలేశ్ యాదవ్ కు అమిత్ షా కౌంటర్..
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు. ఇది అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయని, ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించడంతో పాటు వారు దేశం దాటకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చేపట్టిన చర్చలో హోంమంత్రి అమిత్ షా ఈ రోజు మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాదులను…

