మావోయిస్టులకు భారీ షాక్: దశాబ్దాల పోరాటాన్ని దెబ్బకొట్టిన కేంద్రం.. రూ. 92 కోట్ల ఆస్తులు సీజ్!
దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర హోం శాఖ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడంపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏకంగా రూ. 92 కోట్ల విలువైన మావోయిస్టుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటికే బలహీనపడిన మావోయిస్టు ఉద్యమం, ఈ ఆర్థిక దెబ్బతో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా…

