కాళేశ్వరంలో గులాబీ జెండా రెపరెప: వెయ్యికి పైగా ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ మద్దతుదారుడి ఘన విజయం!
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుదారుడు ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి తన ప్రత్యర్థిపై వెయ్యికి పైగా ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత కొంతకాలంగా రాజకీయంగా అనేక ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ విజయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న…

