News

National

బీహార్‌లో నితీశ్ కుమార్‌కు కీలక ఘట్టం: పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

బీహార్ రాష్ట్రంలో NDA (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్ అధికారికంగా ఖరారయ్యారు. నవంబర్ 19, 2025న జరిగిన NDA శాసనసభా పక్ష సమావేశంలో, ఎమ్మెల్యేలు నితీశ్ కుమార్‌ను ఏకగ్రీవంగా కూటమి నేతగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయం తరువాత, ఆయన త్వరలో గవర్నర్‌ను కలుసుకుని, తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన లేఖను సమర్పించనున్నారు. నితీశ్ కుమార్ రేపు (నవంబర్ 20, 2025) పాట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది ఆయన…

CINEMA

పైరసీ ఆగిపోతే సినిమా వసూళ్లు పెరుగుతాయా? సోషల్ మీడియాలో చర్చ

ఇటీవల ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBOMMA) మూసివేత, దాని నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్టు వ్యవహారాలపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నేళ్లుగా పైరసీ కారణంగా ఇండస్ట్రీ భారీ ఆర్థిక నష్టాలను చవిచూసిందని, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పరిణామం నేపథ్యంలో పైరసీ ఆగిపోతే సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు నిజంగా పెరుగుతాయా? అనే అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు సినీ పరిశ్రమ ప్రతినిధులు,…

TELANGANA

కల్వకుంట్ల కవిత అరెస్ట్: సింగరేణి కార్మికుల సమస్యలపై నిరసన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల సింగరేణి భవన్ ఎదుట సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కవిత ఆందోళనకు దిగారు. సింగరేణి భవన్ వద్ద బైఠాయించిన కవితను, ఆమెతో పాటు ఉన్న ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణి సమస్యలను పరిష్కరించలేని అసమర్థ ప్రభుత్వం ఇదని విమర్శించారు. డిపెండెంట్ ఉద్యోగులను పునరుద్ధరించాలని మరియు…

SPORTS

శుభ్‌మన్ గిల్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అప్‌డేట్: రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా?

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) గాయంపై బీసీసీఐ (BCCI) నుంచి శుభవార్త వెలువడింది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో మెడ నొప్పితో మైదానాన్ని వీడిన గిల్, ప్రస్తుతం కోలుకుంటున్నాడని, భారత జట్టుతో కలిసి గువాహటికి ప్రయాణించనున్నాడని బోర్డు తెలిపింది. గిల్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, అతడు రెండో టెస్టులో ఆడతాడా లేదా అనే తుది నిర్ణయం మాత్రం మ్యాచ్‌కు ముందు మాత్రమే తీసుకోనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. గిల్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం…

TELANGANA

తెలంగాణ గ్రూప్-2 పరీక్ష రద్దు: పదేళ్ల నాటి అభ్యర్థులకు భారీ షాక్

తెలంగాణలో ఇప్పటికే గ్రూప్-1 వివాదం కొనసాగుతుండగా, మరో సంచలన నిర్ణయంతో గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. 2015–16 సంవత్సరాల్లో అప్పటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్ష నిర్వహణలో TGPSC హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. దాదాపు పది సంవత్సరాల క్రితం ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఇది ఊహించని పరిణామంగా మారింది. తమ ఓఎంఆర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన…

National

మాజీ ప్రేయసిపై అత్యాచార యత్నం – నాలుక కొరికేసిన యువతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా దరియాపూర్ గ్రామంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లై భార్య ఉన్నప్పటికీ, 35 ఏళ్ల చంపీ అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై మోజు పెంచుకున్నాడు. ఆ యువతికి మరొకరితో వివాహం జరగడంతో ఆమె చంపీకి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో, సోమవారం మధ్యాహ్నం ఆ యువతి కట్టెల పొయ్యి కోసం బంకమట్టిని సేకరించడానికి దగ్గర్లో ఉన్న చెరువు వద్దకు ఒంటరిగా వెళ్లగా, చంపీ ఆమెను వెంబడించాడు. చెరువు వద్ద ఆ…

CINEMA

నటి హేమ ఇంట్లో విషాదం – తల్లి కోళ్ల లక్ష్మి కన్నుమూత

ప్రముఖ సినీ నటి హేమ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లాలోని వారి స్వగ్రామమైన రాజోలులో నిన్న రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్త తెలియగానే నటి హేమ హుటాహుటిన స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి ఆమె కన్నీరుమున్నీరయ్యారు, “నిన్న ఉదయం కూడా నాతో ఎంతో బాగా మాట్లాడింది. ఇంతలోనే ఇలా జరిగిపోయింది” అంటూ రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది. గతంలో తాను అరెస్ట్…

TELANGANA

‘ఐబొమ్మ’ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ

ఇటీవల సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగి ఉంటుందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ కేసు వివరాలను తమకు అందించాలని కోరుతూ ఈడీ అధికారులు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు లేఖ రాశారు. పోలీసులు ఇప్పటికే ఇమ్మడి రవి నుంచి మూడున్నర కోట్ల రూపాయలను సీజ్ చేసిన…

TELANGANA

హైదరాబాద్ బిర్యానీ కింగ్‌లపై ఐటీ దాడులు – భారీ పన్ను ఎగవేత ఆరోపణలు

హైదరాబాద్ నగరంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మూడు ప్రముఖ రెస్టారెంట్ చైన్స్ – పిస్తాహౌస్ (Pista House), షాగౌస్ (Sha Ghouse), మరియు మెహఫిల్ (Mehfil) గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌పై ఆదాయపు పన్ను (ఐటీ) దర్యాప్తు విభాగం మంగళవారం ఉదయం నుంచి విస్తృత సోదాలు ప్రారంభించింది. ఈ మూడు బ్రాండ్లకు చెందిన కార్యాలయాలు, బ్రాంచ్‌లు, మరియు యజమానుల నివాసాలతో సహా దాదాపు 30 ప్రదేశాల్లో ఈ దాడులు ఏకకాలంలో జరుగుతున్నాయి. అనేక కోట్ల రూపాయల విలువైన అమ్మకాలను…

AP

ఏపీలో 31 మంది మావోయిస్టులు అరెస్ట్ – భారీ ఆయుధ డంపులు గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌ను షెల్టర్‌గా మార్చుకుని అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాడ్వీ హిడ్మా సహా 6 గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత, ఏపీలోని విజయవాడ, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో OCTOPUS, గ్రేహౌండ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్‌లు ఏకకాలంలో రైడ్స్ నిర్వహించి, మొత్తం 31 మంది మావోయిస్టులను మరియు…