హైదరాబాద్ రిసాలబజార్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా..! డ్రగ్స్ ఉచ్చులో డాక్టర్లు..,!
గంజాయికి బానిసగా మారిన కాబోయే డాక్టర్లు పోలీసులకు చిక్కారు. కాలేజీ క్యాంపస్‌లు, హాస్టల్స్ అడ్డాగా చేసుకొని మత్తులో ఉగుతున్న స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని రిసాలబజార్ కేంద్రంగా సాగుతున్న మత్తు దందాను తెలంగాణ ఈగల్ టీం ఛేదించింది. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు పెడ్లర్లతోపాటు 81 మంది వినియోగదారులపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నగరంలోని ఓ వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఉన్నారు. కొందరిని పరీక్షించగా…